భారత దేశం లో ఎవరూ  మరిచిపోలేని పేరు 'విజయ్ మాల్యా' అతను  మద్యం వ్యాపారవేత్త గా కన్నా  9000 కోట్ల అప్పును ఎగ్గొట్టి ఇంతకాలం‌ దేశానికి చిక్కకుండా ఉన్న తీరుకే‌అందరి నోళ్ళలో‌ ఉంటాడు. అటువంటి మాల్య నేడు భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను 100 శాతం రుణాన్ని తిరిగి చెల్లిస్తానని ట్విట్టర్‌లో ట్విట్ చేసారు.


"63 ఏళ్ల మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాస్, మోసం చేసి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు, మనీలాండరింగ్ సంబంధించిన ఆరోపణలకు  గాను తనను భారత్‌కు అప్పగించాలని కోరతామని " ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో‌ తెలిపారు . కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి జి సిద్ధార్థ మరణం నేపథ్యంలో గత గురువారం లోక్‌సభలో  దివాలా కోడ్ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాన్క్రప్సి కోడ్, ఐబిసి) సవరణలపై చర్చకు స్పందిస్తూ సీతారామన్ ఈ ప్రకటన చేశారు.

" ఆర్థిక మంత్రి నివేదించిన ప్రకటన లో‌ ఈ దేశంలో వ్యాపార వైఫల్యాలను నిషేధించకూడదు, లేదా తక్కువగా చూడకూడదు. ఐబిసి ​​ లేఖలో  సమస్యకు గౌరవప్రదమైన నిష్క్రమణ లేదా పరిష్కారాన్ని ఇవ్వాలి. " అని మాల్యా ట్విట్టర్‌లో చెప్పారు. "ఈ స్ఫూర్తితో దయచేసి నా 100 శాతం సెటిల్మెంట్ ఆఫర్ను అంగీకరించండి " అని ఆయన కోరుకున్నారు.

"పాశ్చాత్య దేశాలలో, ప్రభుత్వం మరియు బ్యాంకులు రుణగ్రహీతలు తమ అప్పులను తిరిగి చెల్లించటానికి సహాయపడతాయి. నా విషయంలో వారు నా ఆస్తుల కోసం పోటీ పడుతున్నప్పుడు నా ఋణాన్ని తిరిగి చెల్లించడానికి నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. " అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: