ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులైన అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృధ్ధి విషయమై సమావేశం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తోన్న నవరత్నాలు మరియు రాష్ట్రంలోని ప్రాజెక్టుల కొరకు నిధుల విషయంలో సహాయం చేయాలని కోరారు. విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయాలని అమిత్ షా ను కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డిగారు. 
 
ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారికి జగన్మోహన్ రెడ్డిగారు కేంద్రం ద్వారా గ్రాంట్లు ఇవ్వాలని కోరారు. 60 వేల కోట్ల రుపాయలు అవసరమయ్యే తాగునీటి సరఫరా పథకానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు. ఏపీకి పారిశ్రామిక రాయితీ, జీఎస్టీ, ఆదాయపు పన్ను రాయితీ కల్పించాలని  కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కౌలు రైతులకు అమలు చేయటానికి కేంద్రం యొక్క సహాయం కావాలని జగన్ కోరారు. 
 
అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధులు సహాయం చేయాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. 2020 సంవత్సరం ఉగాది లోపు రాష్ట్రంలో 25 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చేలా ప్రణాళిక సిధ్ధం చేసామని ఇందుకోసం కేంద్రం సహాయం కావాలని జగన్ ఆర్థిక శాఖా మంత్రిని కోరారు. వైయస్సార్ ఆసరా పథకం రాష్ట్రంలో అమలు చేయటానికి కూడా నిధులు సహాయం చేయాలని ఆర్థిక శాఖా మంత్రిని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డిగారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఆర్థిక శాఖా మంత్రిని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డిగారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వివిధ శాఖల మంత్రులను రాష్ట్ర అభివృధ్ధి కోసం చేసిన విన్నపాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతి ఇచ్చి కేంద్రం నుండి సహాయం అందిస్తే రాష్ట్ర అభివృధ్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. . మరి జగన్ విన్నపాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: