కేశినేని నాని ప్రస్తుతం తెలుగు రాష్త్రాల్లో పరిచయం లేని పేరు, సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అధికార పక్ష నాయకులను అంతెందుకు స్వపక్ష నాయకులకు కూడా చెమట పట్టిస్తున్నారు. గత కొన్ని రోజులు గా ఆయనకు పివిపి కి మధ్యలో‌ ట్విట్టర్  వేదిక గా ఒక గాలి ధుమారమే నడిచింది.

మన్న ఆర్టికల్ 370 రద్దు పై ఆయన ఈ విధంగా స్పందించారు "కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ,గులాంనబీ ఆజాద్ ,ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకుల కైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి తరువాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు"

కానీ నిన్న జరుగుతున్న డాక్టర్ల సమ్మె గురించి ఈసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని చల్ల ఘాటుగా విమర్శ చేసారు. ధర్నాలో పాల్గొంటున్న ఒక జూనియర్ డాక్టర్‌ పై ఓ పోలీస్ అధికారి చేయి చేసుకున్న ఉదంతంపై ఎంపీ కేశినేని నాని.. జగన్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీఎంగారూ మీ పాలనలో శాంతియుతంగా ధర్నా చేస్తే, తమకు జరిగిన అన్యాయంపై నిరసిన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తారా అంటూ ఆయన  ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
‘‘సీఎంగారూ మీ పాలనలో శాంతియుతంగా ధర్నా చేస్తే.. తమకు జరిగిన అన్యాయంపై నిరసన చేస్తే పోలీసులతో కొట్టిస్తారా? రాష్ట్రంలో రౌడీరాజ్యం, ఫ్యాక్షన్‌ రాజ్యం.. పోలీసు రాజ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: