ఎన్నికలకు ముందు జగన్ నవరత్నాలు హామీ ఇచ్చారు.  వీటిని అమలు చేయడానికి పాపం జగన్ పడుతున్న తంటాలు అన్ని ఇన్నీకావు.  నవరత్నాలు అమలు చేయాలంటే వేలాదికోట్ల రూపాయల డబ్బు కావాలి.  ఇప్పటికే రాష్ట్రం అప్పులో ఉన్నది. ఇప్పుడు వీటికి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయో అర్ధంకాని విషయం.  దీంతోపాటు జగన్ పోలవరం టెండర్ విషయంలోనూ, విధ్యుత్ కొనుగోలు విషయంలోనూ కేంద్రంతో వివాదం పెట్టుకునే దిశగా అడుగులు వేశారు.  ఇది కొంత ఇబ్బందికలిగించే అంశం అని చెప్పాలి.  



దీంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వాటిల్లో ఒకటైన మద్యం అమ్మకాలపై నిషేధం విధింపు దిశగా అడుగులు వేస్తున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం విధించకపోతే ఓట్లు అడిగేందుకు ప్రజలముందుకు రాబోమని చెప్పాడు.   ఇలా చెప్పడం అని చెప్పాలి. ఇది డేరింగ్ నిర్ణయమే కావొచ్చు.  కానీ, జగన్ తీసుకునే ఈ నిర్ణయం ఎంతవరకు అమలు జరుగుతుంది అన్నది చూడాలి.  



ప్రస్తుతం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  మంగళవారం రోజున జగన్ ఢిల్లీ వెళ్లారు.  ఢిల్లీలో మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలిశారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారిని అడిగారు.  నితిన్ గడ్కరీతో మాట్లాడారు.  రోడ్ల అభివృద్ధి గురించి చర్చించారు.  అలానే మోడీతో జరిగిన మీటింగ్ లో రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ విషయం గురించి, పోలారం, విధ్యుత్ విషయంలో ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో దాని గురించి చర్చించారు.  అలానే ఎప్పుడు అడిగినట్టుగానే.. ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా మోడీని అడిగారు.  



దీనిపై మోడీ నుంచి ఎలాంటి హామీ రాలేదు.  ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఏ రాష్ట్రానికి ఇకపై ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.  ఇప్పటికే దేశంలో ప్రత్యేక హోదా అందుకుంటున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి.  ఇప్పుడు కేంద్రం ఆయా రాష్ట్రాలపై కన్నేసింది.  ఇచ్చిన రాయితీలు, గ్రాంట్ ఏమౌతున్నది అనే విషయాన్ని ఆరాతీయడం మొదలుపెట్టింది.  ఇచ్చిన డబ్బు ప్రజలకు చేరుతుందా లేదా అనే విషయాలు ఆరాతీస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం డేరింగ్ స్టెప్ తీసుకోవడంతో.. అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడుతున్నాయి.  అవినీతి జరుగుతున్నట్టు బయటకు వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: