అలందా మీడియా కేసులో tv9 రవి ప్రకాష్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు శివాజీ అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు మరోసారి అనుమతిచ్చింది.  ఇటీవల ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం  పై శివాజీ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ పై ఉన్నత న్యాయ స్థానం విచారించింది. 


అలందా మీడియా కేసులో జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించాలని హై కోర్టు ఆదేశించినా పోలీసులు తొలగించలేదని అందువల్లనే ఆయనను అమెరికా వెళ్ళకుండా ఆపారని శివాజీ తరఫు న్యాయ వాది కోర్టు కు తెలిపారు. దీంతో ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసు లు ఆపారని చెప్పారు.  దుబాయ్ ఇమిగ్రేషన్ అధికారు లు కూడా ఆపి వెనక్కి పంపారని వివరించారు.


ఇమిగ్రేషన్ వెబ్ సైట్ లో లుకౌట్ నోటీసు లు తొలగించలేదని దీన్ని కోర్టు ధిక్కరణ గా పరిగణించాలని న్యాయ వాది కోరారు. గత నెల ఇరవై నాలుగు వ తారీకున హై కోర్టు తీర్పు రావడం తో శివాజీ ఇరవై ఐదవ తారీకున అమెరికా వెళ్లార ని పోలీసు ల తరపు న్యాయ వాది కోర్టు కు తెలిపారు. హై కోర్టు ఆదేశా లు వచ్చిన తర్వాత లుకౌట్ నోటీసులు తొలగించటానికి మూడు రోజుల సమయం పడుతుందని  హై కోర్టు నుండి ఆదేశాలు సీఐడీ కి వెళ్లి అక్కడి నుంచి ఇమిగ్రేషన్ కు వెళ్లాలన్నారు.


భారత్ లో ఎవరూ కూడా శివాజీ ని ఆపలేదని దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆపారని తెలిపారు.  ఇరువురి వాదనలు విన్న హై కోర్టు ఇదంతా సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదమని తెలిపింది రేపటి నుంచి మూడు వారాల వరకు అమెరికా వెళ్లేందుకు హై కోర్టు మరోసారి శివాజీ కి అనుమతిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: