ఈవీవీ ఎప్పుడెప్పుడో జంబలకడి పంబ సినిమా చేశారు.  అప్పట్లో ఆ మూవీ సంచలన విజయం సాధించింది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా సినిమా భారీ విజయం సాధించింది.  అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఇప్పుడు నిజం అయ్యాయి. అవుతున్నాయి కూడా.  అమ్మాయిలు అబ్బాయిలుగాను, అబ్బాయిలు అమ్మాయిలుగాను మారతారు..పెళ్లిళ్లు చేసుకుంటారు అనే విషయాలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.  ఈవీవీ సినిమాలో చూపించారు.  అది ఇప్పుడు నిజం అయ్యింది.  ఎక్కడో.. ఏంటో ఇప్పుడు చూద్దాం.  



నార్త్ కోల్ కతాలో మహాజాతి నగర్ అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో సుశాంతో అనే వ్యక్తి ఉన్నాడు.  అబ్బాయి అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇంటర్ లో ఆ వ్యక్తి లైంగికంగా హింసించబడ్డాడు.  ఇంట్లో అమ్మాయి బట్టలు వేసుకోడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది.  అబ్బాయిలా ఉండాలని ఫోర్స్ చేశారు.  చివరకు కాలేజీ ప్రిన్సిపాల్ సహాయంతో లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు. తిస్తాదాస్ గా పేరు మార్చుకుంది.  తరువాత సినిమాల్లో అవకాశం దక్కించుకొని పాపులర్ అయ్యింది.  



ఇక్కడ ఈ కథ జరిగితే మరోచోట మరో కథ జరిగింది.  అనగనగా అస్సాం రాష్ట్రం. అక్కడ చక్రవర్తి అనే అబ్బాయి ఉన్నాడు.  అస్సాంలో ఉన్నప్పుడు అతడు అబ్బాయి కాదు అమ్మాయి.  చిన్నప్పటి నుంచి మగలక్షణాలు ఎక్కువగా ఉండటంతో లింగమార్పిడి చేయించుకొని పూర్తిస్థాయి అబ్బాయిగా మారిపోయాడు.  విచిత్రంగా చక్రవర్తితో తిస్తాదాస్ కు పరిచయం ఏర్పడింది.  వీరి పరిచయం ప్రేమగా మారింది.  ఇద్దరి మనసులు కలిశాయి.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 


బహుశా ఇలాంటి వివాహం జరగడం దేశంలో మొదటిసారి అనుకుంటా.  ఇద్దరు వివాహం చేసుకున్నారు. కథ సినిమా కథలా ఉంది కదా.  వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాలా కామెంట్స్ చేస్తున్నారు.  నిజమైన అబ్బాయిని వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అని అంటున్నారు.  మనసులు కలవడం ముఖ్యంగాని మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోకూడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: