అధికారంలో ఉండగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు ఇపుడు మూల్యం చెల్లించుకుంటున్నారా ? అంటే పార్టీ నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు. కోడెలను సత్తెనపల్లి ఇన్చార్జిగా తొలగించాలని డిమాండ్ చేసే నేతల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా తనకు బద్ద శతృవైన మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు వర్గం సమావేశం పెట్టటం పై కోడెలలో టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఎప్పుడైతే తన వ్యతిరేకంగా  రాయపాటి వర్గం పార్టీ కార్యాలయంలోనే సమావేశం అవుతోందని తెలిసిందో వెంటనే తన వర్గంతో కోడెల కూడా మరో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు లేండి. గుంటూరులో రెండు కార్యాలయాలున్నాయి లేండి. అందుకనే కోడెల-రాయపాటి వర్గాలు వేటికవే విడివిడిగా సమావేశమయ్యాయి.

 

సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జి పదవి నుండి కోడెలను ఊడబీకించాలన్నది రాయపాటి వర్గం డిమాండ్. అందుకు కోడెల వ్యతిరేకులందరినీ బాగానే సమీకరించారు. నిజానికి జిల్లాలో కోడెలకు అసలు తిరుగన్నదే లేదు. అంటే కోడెల వ్యవహారశైలి నచ్చని వాళ్ళున్నా బహిరంగంగా కోడెలపై మాట్లాడేంత సాహసం చేయలేదు. కానీ ఎప్పుడైతే స్పీకర్ అయ్యారో అప్పటి నుండో కోడెల డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. స్పీకర్ స్ధానానికున్న గౌరవాన్ని దిగజార్చేశారు.

 

కోడెలకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు ఇష్టారాజ్యంగా దోచేసుకున్నారు. తన మన అన్న తేడా లేకుండా అవసరమని వచ్చిన ప్రతీ ఒక్కరిని నిలువు దోపిడీ చేసేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎవరు పచ్చగా కనిపించినా అంతే వాళ్ళపై టార్గెట్ పెట్టి దోచేసుకున్నారు. అధికారంలో ఉన్నారు కదా అందుకనే వాళ్ళపై ఎవరూ ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు పెట్టలేదు.

 

ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే కేసులు నమొదయ్యాయి. కోడెల కుటుంబంపై సుమారు 25 కేసులు నమోదై అరెస్టు వారెంటు కూడా జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పార్టీ నుండి కోడెలను తరిమేసే ప్లాన్ కూడా మొదలైనట్లే ఉంది. అందుకనే పోటాపోటీగా సమావేశాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: