9 నెలలు పసి పాప అని కూడా చూడకుండా కామంతో పసిపాపను అత్యాచారం చేసి చంపేశాడు ఓ కామాంధుడు. జూన్ 18న తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై ప్రవీణ్ అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎంతోమంది ఎన్నో విధాలుగా స్పందించి బాధితురాలు కుటుంబానికి అండగా నిలిచి మరణ శిక్ష వెయ్యాలని నినాదాలు చేస్తూ ధర్నాలు చేపట్టారు. 


ఆ ధర్నాలకు సమాధానం ఇస్తూ అతి తక్కువ సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అది మాములుగా కాదు కామాంధులు ఉలిక్కి పడేలా, ఇంకొకసారి ఏ మహిళాఫై అయినా అత్యాచారం కానీ అలాంటి ప్రయత్నం కానీ చెయ్యాలంటే భయపడేలా నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవీణ్ ను విచారించిన తర్వాత న్యాయమూర్తి కె.జయకుమార్ అతనికి మరణశిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పును వెలువరించారు.  


అయితే మొట్ట మొదటిసారి ఒక ఘటనపై ఇంత తక్కువ సమయంలో తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందిస్తూ 'చిట్టితల్లికి న్యాయం జరిగింది అని ఒకరంటే' మరికొందరు స్పందిస్తూ 'మన కోర్టు ఇంత తక్కువ సమయంలో తీర్పుచెప్పాడం ఆనందంగా ఉంది' మరి కొందరు అంటున్నారు. 


మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తూ 'ఆ కామాంధుడికి మరణ శిక్ష కూడా తక్కువే, అలాంటి కామాంధులకు మరణ శిక్ష కాదు ఫ్యామిలీ ఆపరేషన్ చెయ్యాలని' అంటే, మరి కొందరు మాత్రం 'చిత్రహింసలు పెట్టి చంపాలి, ఒక్క నిమిషంలో ప్రాణం పోయేలా చంపకూడదు' అంటూ ట్విట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇంత తక్కువ సమయంలో ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి తీర్పు ఇవ్వడం ఇది మొదటిసారి. 


మరింత సమాచారం తెలుసుకోండి: