భారత దేశంలో దశాబ్ద కాలంగా మహిళలపై అఘాయిత్యాలు వరుసగా జరుగుతున్నాయి.  ఈ మద్య మరీ దారుణంగా చిన్నారులపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు.  వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపాడో కామాంధుడు. ఆ తర్వాత తన గుట్టు రట్టు అవుతుందని దారుణంగా గొంతు నులిమి చంపాడు. జగన్, రచనలకు 9 నెలల చిన్నారి ఉంది. టైలర్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నారు.డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి మృతదేహాన్నివరంగల్‌లోని MGM ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది.

అత్యాచారానికి పాల్పపడిన ప్రవీణ్  చిన్నారిని చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై యావత్ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రెండు రాష్ట్రాల మహిళా సంఘాలు ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించాయి. ఆ కామాంధుడిని వెంటనే ఉరి తీయాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు కూడా చేపట్టారు.  తాజాగా  9 నెలల చిన్నారి శ్రీహితను అత్యాచారం చేసి చంపేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు సంచలన తీర్పునిచ్చింది.

అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం జరిగిపన ప్రవీణ్ ని దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. కేసును విచారించిన కోర్టు కేవలం 48 రోజుల్లోనే దోషికి మరణదండన విధించింది. అయితే ఈ ఘటన మొత్తం ఇంటికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. 

ఆ కామాంధుడు అత్యాచారం చేస్తుండగా నొప్పి భరించలేక విల విలలాడిన పాప ఏడవటంతో భయంతో గొంతు నులిమి చంపేశాడు. నంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.  ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కోర్టు నింధితుడు ప్రవీణ్ కి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: