వైసిపి నేతలందరూ చంద్రబాబునాయుడు మానసిక పరిస్ధితి మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు చంద్రబాబు మానసిక పరిస్ధితి మీద అనుమానం వ్యక్తం చేసింది కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి కెవిపి రామచంద్రరావు. అల్జిమర్స్ వచ్చిందని అదని ఇదని చెప్పి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్  చేశారు.  అప్పటి నుండి వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అదేపనిగా చంద్రబాబు అరోగ్య పరిస్దితిపై ట్వీట్లు పెడుతునే ఉన్నారు.

 

అసలైతే చంద్రబాబుకు ఏవో మానసిక సమస్యలున్నట్లుగా అనుమానాన్ని వ్యక్తం చేసింది మొదట ఉన్నతాధికారులే. ఎందుకంటే సిఎంగా ఉన్నంత కాలం చెప్పిందే చెప్పటం, ఒకే అంశంపై ఉదాహరణకు ఇసుక రీచులపై  ఒకేరోజు ఐదారుసార్లు సమావేశాలు పెట్టటం లాంటివి చేసి అధికారులను చావగొట్టేవారు.

 

అంటే ఉదయమే ఇసుక రీచులపై సమావేశం నిర్విహించానని మరచిపోయి మళ్ళీ మళ్ళీ వేర్వేరు సందర్భాల్లో కూడా మాట్లాడేవారా అన్న అనుమానం అధికార యంత్రాంగం ద్వారానే బయటకు పొక్కింది. దాన్నే కెవిపి విశ్వవ్యాప్తం చేశారు. ఇదంతా ఎందుకంటే తాజాగా వైసిపి నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య కూడా మీడియా సమావేశంలో అదే అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం కాదులేండి ఈయన కన్ఫర్మ్ కూడా చేసేశారు.

 

ప్రజాస్వామ్యంలో పార్టీ ఓటమికి జనాలను బాధ్యులను చేసిన ఏకైక  నేత చంద్రబాబు మాత్రమే అంటూ రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. వైసిపిని తన్నే దున్నపోతుగాను టిడిపిని పాలిచ్చే ఆవుతోను పోల్చుకోవటం చంద్రబాబు మానసిక పరిస్ధితికి అద్దం పడుతోందంటూ ఎద్దేవా చేశారు. 2014లో టిడిపి పాలిచ్చే ఆవు అని అనుకునే జనాలు ఓట్లేసినట్లు రామచంద్రయ్య చెప్పారు.

 

అయితే టిడిపి ఆవు కాదని దున్నపోతని తెలియటంతోనే మొన్న మాడు పగలగొట్టినట్లు చెప్పటం గమనార్హం. తనపై ఫిర్యాదులకే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపణలతోనే ఆయన మానసిక పరిస్ధితి ఏంటో తెలిసిపోతోందని చెప్పటం సబబేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి: