తెలంగాణా ప్రభుత్వం సంచారజాతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు స్వయం సమృద్ధి సాధించి సుస్ధిర ఆదాయం పొందడానికి, ఆటోరిక్షా స్కీమ్‌ని ప్రకటించింది.వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌ ఈ కార్యక్రమం మొదలు పెట్టారు.ఈ పథకానికి దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 21 సం|| నుండి 40 సం|| లోపు ఉండాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.


మీ దరఖాస్తుతో పాటు జత పరచవలసిన ధృవీకరణ పత్రాలు వివరాలు :

1) కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు

2) ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ

3) విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు

4) 2 పాస్‌పోర్ట్‌ ఫోటోలు

5) ఈ ఆటో రిక్షా నడపడానికి అవసరమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా జతపరచాలి.

6) వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారికి రూ. 2 లక్షలు లోపు కలవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

సఃంచార జాతుల వారికి అందచేసే ఆటోరిక్షాలు బ్యాటరీతో నడిచేవి. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 130-150 కి.మీ. వరకు నడపొచ్చు. పైగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల కంటే కూడా ఒక్క యూనిట్‌ విద్యుత్‌ ధర తక్కువ. ఆటోలో ఒకసారి ఏడుగురు కూర్చునేల సీటింగ్‌ ఉంటుంది. ఈ ఆటో ధర 2.10 లక్షలు ఉంటుంది. ఇందులో 60% సబ్సిడీ ఇస్తుండగా లబ్దిదారులు 40% చెల్లించాల్సి ఉంటుంది.


ఈ స్కీమ్‌నకు అత్యంత వెనుకబడిన కార్పొరేషన్‌ నుండి ఆర్థిక చేయూత అందిస్తారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతి యువకులు ఆన్‌లైన్‌ ద్వారా( www.brtop.telangana,gov.in ) 15.8.2019 లోపు దరఖాస్తు చేసుకోవాలి. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది.

మరింత సమాచారం కొరకు, పూర్తి వివరాలకు,

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గారి కార్యాలయం,

రూమ్‌ నెం.9 కలెక్టర్‌ గారి కార్యాలయం బురుగుపల్లి, వికారాబాద్‌ జిల్లా.( phone 9849903707 )

సంప్రదించవలసిందిగా,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ పుష్పలత కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: