ఏపీలో టీడీపీ కార్యకర్తలపై జరిగే దాడులకు సీఎం సమాధానం చెప్పాలన్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా భీమవరానికి చెందిన పార్టీ కార్యకర్త శ్రీహరి పై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. పార్టీ తరపున యాభై వేల రూపాయల సాయమందించామని చెప్పారు. దాడుల గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదన్న ఆయన, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ , చలో పల్నాడు పేరుతో పార్టీ నాయకులను అక్కడికీ పంపుతున్నామని చెప్పారు చంద్రబాబు.



దీనిపై ఆయన మాట్లాడుతూ "ప్రతి ఒక్కరికీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంది. వీళ్ళు పిచ్చిపిచ్చి ఆటలాడితే ఇది మంచిది కాదని చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్న" అని ఆయన వారించారు.


"దీనికి ముఖ్య మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరూ కూడా అధైర్యపడకండి, ఏమాత్రం కూడా భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఏదైనా ఉంటే ఇలాంటివి వచ్చినప్పుడు మాకు కూడా చెప్పండీ, మేం మీకు అండగా ఉంటాం అన్ని విధాల ఆదుకుంటాం. అందుకే రేపు మొత్తం జిల్లా నాయకత్వాన్నంతా  పల్నాడు ప్రాంతానికి పంపిస్తున్నాం. దీనికి పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రజలు నివసించే హక్కు ఉందా లేదా.?  పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేసే దానిని ఇంకెక్కడికి తీసుకు పోవాలి.? " అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.



ఇదే సంధర్బంలో ఆయన నేడు విడుదలయిన  కియా కార్ల గురించి మాట్లాడుతూ అది తాను  కన్న కల అని నేడు అవి రోడ్ల పైకి రావడం ఆనందం గా ఉందని హర్షం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: