చంద్రబాబునాయుడు వేసుకున్న ’కియా’ ముసుగు తొలగిపోయిందా ? కియా కార్ల యాజమాన్యం చేసిన ప్రకటనతో నిజమే అనిపిస్తోంది. దక్షిణ కొరియాలో కార్ల తయారీ సంస్ధ కియా అనంతపురం జిల్లాలో ప్లాంట్ పెట్టిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలోని పెనుకొండలో కార్ల తయారి ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేసింది. ఆ ప్లాంటులో తయారైన మొదటికారును  గురువారం నాడు యాజమాన్యం విడుదల చేసింది.

 

జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ అవాల్సిన మొదటికారును మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలు విడుదల చేశారు. జగన్ కు కుదరని కారణంగా కారును మంత్రులు రిలీజ్ చేయటం వరకూ బాగానే ఉంది. మరి కొద్ది నెలల క్రితం ఇటువంటి కార్యక్రమమే చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూడా జరిగింది కదా ?

 

ఇపుడు జరిగింది మొదటికారు విడుదలైతే  మరి చంద్రబాబు హయాంలో విడుదలైన కారు మాటేమిటి ? ఇక్కడే మతలబంతా ఉంది. చంద్రబాబు హయాంలో విడుదలైన కారు పెనుకొండ ప్లాంటులో ఉత్పత్తయినది కాదు. అప్పుడు జరిగింది కేవలం ఓ మాయ. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాల దృష్టిలో తాను గొప్ప అనిపించుకోవటం కోసం చంద్రబాబు ఆడిన నాటకం.

 

అప్పుడు విడుదలైన కారు పెనుకొండ ప్లాంటులో ఉత్పత్తయిన కారు కాదు. ధక్షిణకొరియాలో తయారైన ఓ పదికార్లను చంద్రబాబు కోసం యాజమాన్యం హడావుడిగా కొరియా నుండి పెనుకొండ ప్లాంటుకు పంపించింది.  ఆ కార్లనే చంద్రబాబు ఎలక్షన్ స్టంట్ కోసమని మొదటికారు విడుదలంటూ నానా హడావుడి చేశారు.

 

తాజాగా కియా కార్ల యాజమాన్యం చేసిన ప్రకటనతో చంద్రబాబు మోసం మొత్తం బయటపడింది. చంద్రబాబు ఏమి చేసినా ఇలాగే ఉంటుంది. ప్రతీ విషయాన్ని మాయ చేయటం, జనాలను మోసం చేయటమే చంద్రబాబు అలవాటు. ఆ అలావాటు ప్రకారమే కియా కార్ల యాజమాన్యాన్ని కూడా పావుగా ఉపయోగించుకున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. అందుకే పదే పదే కియా కార్ల ప్లాంటును ఏర్పాటు చేసిన పెనుకొండలో కూడా టిడిపి ఓడిపోవటం ఏమిటంటూ తెగ బాధపడిపోతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: