ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ విస్తృత సమావేశాలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం కేంద్రమంత్రులు గడ్కరీ, నిర్మలా సీతారామన్‌లతో భేటీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని గడ్కరీని కోరిన సీఎం
నవరత్నాలకింద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి భారీ కార్యక్రమాలు చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు వివరించిన సీఎం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి రెవిన్యూలోటు భర్తీతోపాటు, వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులతోపాటు ఉదార సహాయం చేయాలని వినతి
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని కోరిన ముఖ్యమంత్రి వరుసగా రెండో రోజు ఢిల్లీలో పర్యటించిన   ఉపరాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత ఆయన రాష్ట్రపతి కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తర్వాత  కేంద్ర రోడ్డు రవాణా, హైవేల  శాఖ మంత్రి  శ్రీ నితిన్‌  గడ్కరితో  భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అనేక ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. జాతీయ రహదారులుగా గుర్తించాలంటూ కొన్ని రాష్ట్ర రహదారుల వివరాలు ఆయనకు నివేదించారు.

తీవ్ర ఆర్ధిక కష్టాలతో  ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని ఆ మేరకు సాయం చేయాలన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌  నిర్మాణం పూర్తి చేయడంతో పాటు దీనికి సంబంధించి నిధుల విడుదల అంశాన్ని కూడా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 
ఆ తర్వాత ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్దిక శాఖమంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్‌ తో సమావేశమయ్యారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల్సి ఉందని, దీనికోసి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన మొత్తంతోపాటు, ఆతర్వాత కూడా సకాలంలో నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధులు వెంటనే  విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సముచిత రీతిలో సహాయం చేయాలని విన్నవించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: