జగన్ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఫ్రాక్షనిజం నుంచి వచ్చాడని,  రౌడీయిజం, గూండాయిజం చేస్తే సహించమని నిండు అసెంబ్లీలో సీఎమ్ హోదాలో పలుమార్లు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అయిదేళ్ళ పాటు జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ లాంటి వారిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు జగన్ విషయంలో జనం తెలివిగా వ్యవహరించారని, అందుకే ఆయన్ని గెలిపించలేదని కూడా బాబు అప్పట్లో పదే పదే అనేవారు


ఇక జగన్ ఏపీలో విపక్షంలో ఉంటూ అభివ్రుద్ధి నిరోధకుడిగా పేరు తెచ్చుకున్నాడని, ఆయన వల్ల ప్రగతి ఆగిపోయిందని, పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని కూడా బాబు అనేకసార్లు అన్నారు. జగన్ పుణ్యామని పారిశ్రామిక వేత్తలు ఏపీ అంటే భయపడిపోతున్నారని కూడా చంద్రబాబు అంటూ వచ్చారు.  ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా తొలిసారి రాష్ట్రల్లో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ రోజు నుంచి మొదలైభారీ  ఎత్తున రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు విజయవాడలోని నోవెటెల్ హొటల్ ముస్తాబు చేశారు.


దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దాదాపుగా నలభై దేశాల నుంచి ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులు హాజరవుతున్నారట. మొదటి రోజు జగన్ వేదిక మీద మాట్లాడిన తరువాత రెండవ రోజు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తోనూ ముఖా ముఖీ మాట్లాడుతారట. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జగన్ ఏపీకి పెట్టుబడులను ఎలా తీసుకువస్తారన్నది చూడాలి. 


జగన్ వస్తే ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాదు. ఆయన విధానలు దారుణమైనవని దుమ్మెత్తి పోస్తున్న టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబుకు షాక్  ఇచ్చేలా భారీ పెట్టుబడులను ఏపీకి జగన్ తీసుకురాగలుగురారా అన్నది చూదాలి. మొత్తానికి తన మీద పడిన చెడ్డ పేరుని జగన్ ఈ సదస్సుని విజయవంతం చేసుకోవడం ద్వారా పోగొట్టుకుంటారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల వ్యవధిలోనే జగన్ పెట్టుబడుల సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకోవడం గుడ్ బిగినింగ్ గానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: