వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/ వార్డ్ వాలంటీర్ల నియామకం ద్వారా భారీగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల ద్వారా 1,26,728 ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలు మాత్రమే కాకుండా మరో 12 వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మద్యపాన నిషేధం అమలులో భాగంగా మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,500 మద్యం షాపుల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించబోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మద్యం దుకాణాల్లో ముగ్గురు, పట్టణ ప్రాంతాల్లో నలుగురు చొప్పున పని చేయాల్సి ఉంటుంది. 
 
మద్యం షాపుల్లో పని చేయాల్సిన ఉద్యోగుల్ని జాయింట్ కలెక్టర్లు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రతి మద్యం దుకాణంలో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్ మెన్ ఉంటారు. సూపర్ వైజర్ కు కనీస విద్యార్హత డిగ్రీ, సేల్స్ మెన్  ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి. ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా బాండ్లను స్వీకరించి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు సమాచారం. సూపర్ వైజర్ కు 17,500 రుపాయలు, సేల్స్ మెన్ కు 15,000 రుపాయలు వేతనాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 
 
 
 ఒక ఏడాది కాలానికి మాత్రమే ఈ సిబ్బందిని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులను ప్రతి సంవత్సరం 20% తగ్గిస్తూ చివరకు ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం దొరికేలా చేయబోతుంది ప్రభుత్వం. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: