మోడీ లాంటి ప్రధాని ఏదైనా అనుకుంటే చేయడం సుసాధ్యమే. అది చాలా సార్లు నిరూపించారు. తాజాగా ఆయన కాశ్మీర్ ని రెండు ముక్కలుగా విభజిస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మోడీ నిర్ణయాన్ని భారతావని ఇపుడు వేన్నోళ్ల పొగుడుతోంది. మోడీకు ఉన్న దూకుడు, చొరవ ఇంతకు ముందు వాళ్ళకు కూడా ఉంటే ఎపుడో కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం  అయ్యేదని కూడా అంటున్నారు. 


ఇక మోడీ ఆఫర్ అంటేనే అది గొప్ప చాన్స్. టాలీవుడ్ ఏపీ విభజన తరువాత కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి టాలీవుడ్ కి మోడీ మెగా ఆఫర్ ఇచ్చేశారు. రండి కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టండి, షూటింగులు చేసుకోండి. స్టూడియోలు కూడా కట్టండి అంటూ  మోడీ ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ బహు గొప్పదే. కాశ్మీర్ అందాలు పాత సినిమాల్లో కనిపిస్తాయి. ఎన్నో హిందీ సినిమాలు కొన్ని తెలుగు సినిమాలు కూడా డెబ్బయి, ఎనభై దశకంలో కాశ్మీర్ అందాలను కెమెరాల్లో బంధించి సెల్యూలాయిడ్ మీద అందంగా ప్రదర్శించాయి.


ఇక 90 దశకం తరువాత కాశ్మీర్ తీరే మారిపోయింది. దాంతో ఎవరూ అటు వైపే పోలేదు. రోజా మూవీని కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ గా తీసిన మణిరత్నం లోకేషన్ల కోసం అక్కడికి వెళ్ళాలనుకుంటే అనుమతులు ఇవ్వని పరిస్థితి   ఏర్పడింది. ఇప్పటికి ముప్పయ్యే ళ్ళుగా  కాశ్మీర్ మండిపోతూనే ఉంది. మంచు కొండలు మంటల్లోనే మరిగిపోతున్నాయి.   మరి కాశ్మీర్ ని ఇపుడు భారత్ లో పూర్తిగా కలిపేసి అన్ని అడ్డంకులు తొలగించిన మోడీ కాశ్మీర్లో పెట్టుబడులకు తెలుగు, తమిళ్,హిందీ పరిశ్రమను ఆహ్వానించారు. 


ప్రత్యేకించి అతి పెద్ద  సినీ పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ కి ప్రధాని ఇచ్చిన ఆఫర్ గొప్పగానే భావించాలి. కాశ్మీర్లో స్టూడియోలు పెట్టుకోండి అన్న మాటలు నిజంగా అనందకరమే. హైదరాబాద్ చుట్టునే స్టూడియోలు కట్టి స్థిరపడిన టాలీవుడ్ ఇపుడు కాశ్మీర్ వైపు కదులుతుందా. మంచి లొకేషన్ల కోసం విదేశాలకు వెళ్తున్న టాలీవుడ్ కి ఇపుడు కాశ్మీర్ అందాలు క‌న్ను గొడుతున్నాయి. కొత్తందాలు చూపించేందుకు రెడీ అంటున్నాయి. మరి టాలీవుడ్ ఎల రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: