కియా కార్ల యాజమాన్యంపై హిందుపురం ఎంపి గోరంట్ల మాధవ్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. యాజమాన్యం ఇంకా చంద్రబాబునాయుడు మత్తులో నుండి బయట పడినట్లు లేదంటూ రెచ్చిపోయారు. కియా యాజమాన్యం ఇంకా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తోందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం పెనుకొండలో తయారైన  కియా కారును విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

మొదటి కారు రిలీజ్ సందర్భంగా ఓ ఫంక్షన్ జరిగింది. ఆ సందర్భంగా మంత్రులతో పాటు ఎంపి మాధవ్ కూడా పాల్గొన్నారు. మంత్రులు, ఎంఎల్సీలు, ఎంపిలతో కారుపై సంతకాలు చేయించుకున్నది యాజమాన్యం. ఆ సమయంలో కారు బాయ్ నెట్ పై అందరూ సంతకాలు చేశారు. అదే సమయంలో తాను కూడా సంతకం చేసిన మాధవ్ తన నిరసనను తెలుపుతు కామెంట్ కూడా రాశారు.

 

కియా కార్ల ప్లాంటులో తమ ప్రభుత్వం చేసిన తాజా చట్టం ప్రకారం స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఉన్నతస్ధాయి ఉద్యోగాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. స్ధానికులకు మాత్రం బాత్ రూములు క్లీనింగ్, వాచ్ మెన్లు,  గడ్డిపీకే పనులే ఇస్తున్నట్లు చెప్పారు. నిజానికి చంద్రబాబు హయాంలో స్ధానికులకు ఉద్యోగాలపై జరిగిన ఒప్పందాన్ని యాజమాన్యం లెక్క చేయలేదు. ఆ విషయం తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో పెనుకొండలో కూడా ఓటమి.

 

స్ధానికులకు ఉద్యోగవకాశాలపై యాజమాన్య వైఖరిని తొందరలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని తీవ్రంగా హెచ్చరించారు. సరే విషయం ఏదైనా కానీ మొదటి కారు విడుదల ప్రోగ్రామ్ లో మాధవ్ నిరసన తెలపటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి అదే కార్యక్రమానికి హాజరైన మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ రోజా లాంటి వాళ్ళు మాత్రం కారుపై సంతకాలు చేసినపుడు కేవలం శుభాకాంక్షలు మాత్రమే తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: