తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో చేసిన ఒక  పోస్ట్ సెల్ఫ్ గోల్ గా మారింది. 40 ఏళ్ల రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు తనస్థాయి ని తానే దిగజార్చుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి  ట్విట్టర్ లో అర్ధ సత్యం కూడిన ఒక పోస్టు చేశారు .   వైకాపా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఆశా  వర్కర్ల జీతాలను 10 వేల రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే.


 ఆశా వర్కర్లు తమ జీతాల  పెంపు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఫోటో తో  పాటు,  మరొక పక్క అదే ఆశా వర్కర్ల దుస్తుల్లో ఉన్న మహిళలు  శవయాత్ర చేపడుతున్న ఫొటోల ను  చంద్రబాబు నాడు-నేడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అయితే ఆయన చేసిన పోస్ట్ బూమరాంగ్ అయింది. ఎందుకంటే  ...  శవ యాత్ర చేస్తున్న ఆశా వర్కర్లు ఫోటో ఇప్పటిది కాదని 2017వ సంత్సరం  లోదని తేలింది .


 అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కాదని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ అద్వర్యం లో ఆశావర్కర్లు నిజామాబాద్ లో చేపట్టిన  శవయాత్ర ఫొటో అని నెటిజన్లు తేల్చారు  . అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు , చంద్రబాబు మాత్రం అది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న సంఘటన  అనేవిధంగా కలర్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో  నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.


 సోషల్ మీడియా లో ఏదైన పోస్టు చేసేముందు తెలుగు తమ్ముళ్లు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోకపోతే ... ఇదే తరహాలో అభాసుపాలు కావాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: