ఇటీవల జరిగిన ఏపి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చింది.  ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు కంకన బద్దులై ఉన్నారు.  ఇందుకోసం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి సంతం పెన్షనర్లకు సంబంధించినదే కావడం విశేషం. అయితే కొంత మంది గిట్టని వారు పెన్షన్ పథకం పై లేని పోని అపోహలు సృష్టిస్తున్నారు. మరోవైపు పెన్షనర్ల విషయంలో కొంత మంది దళారులు కూడా తమ హస్తవాసం చూపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇలాంటి వారి మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటుంది.  


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.  " వైఎస్సార్ పెన్షన్ (YSR Pension)"" పథకం క్రింద ఈ దిగువ కేటగిరీల వారిగా నెలవారీ పెన్షన్ ఇస్తుంది... ప్రస్తుతం ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తోంది. మీకు తెలిసిన అర్హులు ఉంటే పంచాయతీ సెక్రటరీ ద్వారా అప్లై చేయించండి.
కాటగిరి: 
1). 60 సంవత్సరాలు నిండినవారు ఎవరైనా,
2). వితంతువులు (widow) 18 సంవత్సరం లు నిండినవారెవరైనా. 
3). గ్రామాల్లో మాత్రమే నివసించే పెళ్లికాని 30 సంవత్సరంలు నిండిన ఒంటరి మహిళలు 
4). S.C డప్పు కళాకారులు 50* సంవత్సరంలు  నిండినవారు..
5). S.T 50 సంవత్సరంలు నిండినవారెవరైనా
6). వికలాంగులు, గుడ్డివారు, మతిస్థిమితం గలవారెవరైనా వయసుతో సంబంధం లేదు.. 
7). ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు...వారెవరైనా
8) 50 సంవత్సరాలు నిండిన నెయ్యలవారు, జాలర్లు, (చేపలు పట్టేవారు)
మీకు తెలిసిన అర్హులకు చెప్పి సహాయం చేయండి.
పంచాయతీ కార్యదర్శి దే పూర్తి బాధ్యత...
ఏ పెన్షన్ రావాలన్న పల్స్ సర్వే చేసుండాలి...
చేసివుండకపోతే పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళితే వారే పల్స్ సర్వే చేస్తారు...
ముఖ్య గమనిక  : మరిన్ని వివరాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించండి.  దళారులను నమ్మి మోసపోవద్దు, ఒకవేళ అలాంటి వారు మీకు తారసపడినా, మాటలతో మభ్యపెట్టినా వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: