ఈ విషయం పై ఆయన మీడియా తో మాట్లాడుతూ, "నేనైతే ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి. ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ, మొట్టమొదటసారి శాంతి భద్రతలు ఇంత వైఫల్యం చెందినటువంటి ఏకైక ప్రభుత్వం ఇంత వరకు లేదు, రేపు భవిష్యత్తులో లేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా లేదు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వంగా పేరు పొందింది." అని ఆయన అన్నారు.


జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైసిపి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎనభై ఏడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతు భరోసా ఆపటం రైతులకు వచ్చే నిధులు నిలిపివేయటమే ఆత్మహత్యలకు కారణమన్నారు కాల్వ.


ఈ విషయం పై ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ, "రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారైంది ఈ రోజు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి డెబ్బై రోజులు గడవక ముందే ఈ రాష్ట్రం లో తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనా విధానాల వల్ల, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లడం వల్ల ఈ రోజు అన్నదాతల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, అర్థాంతరంగా అశువులు బాసి, వాళ్ల కుటుంబాల్ని అనాథలుగా చేస్తున్నారు. దీని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది." అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: