తెలంగాణలో టిఆర్ ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ చేతులెత్తిసింది. ఇప్పటికే సీఎల్పీ టిఆర్ ఎస్ లో విలీనం అయిపోయింది. ఇక మిగిలింది ఆరుగురు ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిపై బీజేపీ ఫోకస్ పెట్టిందట. ఆ ఎమ్మెల్యే కు వెల్కం సాంగ్ ప్లే చేస్తోన్న కాషాయ కండువా ఎవరో కాదు గరికపాటి మోహన్ రావు. బీజేపీ లోకి జంప్ అయిన నలుగురు టిడిపి ఎంపీల్లో గరికపాటి కూడా ఒకరు. సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెల్చుకున్న బీజేపీ మరింత దూకుడుగా బలం పెంచుకోవాలని ఎత్తులు వేస్తుందట. ఆ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కి పదును పెడుతోందట.


ఇందులో భాగంగానే గరికపాటి మోహన్ రావు పావులు కదుపుతున్నారట. సుధీర్ఘకాలం టిడిపి లో ఉన్నారు గరికిపాటి చాలామంది టిడిపి నేతలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ పరిచయాలు ఇప్పుడు వాడటానికి రెడీ అవుతున్నారట గరికిపాటి. అసలు ఆయన పార్టీ వీడటమే చంద్రబాబుకే పెద్ద షాక్ అని చెబుతాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాంటి షాకే ఇచ్చి ఆ పార్టీ ఎమ్మెల్యే కి కాషాయ కండువా వేయటానికి గరికపాటి పావులు కదుపుతున్నారట.


పూర్వాశ్రమంలో టిడిపిలో ఉన్న ఆ ఎమ్మెల్యే గరికపాటి సలహా మేరకు నడుచుకునే వారట. బీజేపిలో ప్రాధాన్యత పెరగాలంటే సత్తా చూపాలని భావిస్తున్నారట గరికిపాటి. తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి కాషాయ కండువా వేస్తే హైకమాండ్ దృష్టిలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయనీ ఆలోచన చేస్తున్నారట. అయితే, పార్టీ మారితే అనర్హత వేటు తప్పదన్న ఆందోళన ఆ ఎమ్మెల్యేని వేధిస్తోందట. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారట. త్వరలోనే అమిత్ షాని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన సమక్షంలో వివిధ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలతోపాటుగా ఆ ఎమ్మెల్యేను కూడా పార్టీలో చేర్చుకోవాలని గరికపాటి మోహన్ రావు వ్యూహ రచన చేస్తున్నారట. ఈ స్కెచ్ ఎంత వరకూ ఫలిస్తుందో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: