ఏపీ సీఎంగా అతి చిన్న వయసులో భాద్యతలు చేపట్టిన జగన్ పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తూ అందరీ చేత శెభాష్ అనిపించుకుంటున్నారు. అడిగితే బోలా శంకరుడు మాదిరిగా అభయహస్తం ఇచ్చే సీఎంగా తక్కువ కాలంలోనే పేరు పొందాడు. అయితే జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను మాత్రమే కాదు పక్క రాష్ట్రంలోని ప్రజల అవసరాలు కూడా తీరుస్తానని చెప్పడం ఇప్పుడు అందరినీ మంత్ర ముగ్దులను చేస్తుంది. ఇప్పటికే ఏపీ సీఎం క్లారిటీగా చెప్పేశారు. పక్క రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను పెట్టుకుంటాని ప్రతి దానికి గొడవ పడనని చెప్పారు. పక్క రాష్ట్రం అయిన తెలంగాణతో కూడా స్నేహ పూర్వక సంబంధాలను జగన్ పెట్టుకున్నారు. 


అయితే తమిళనాడు విషయంలో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా శెభాష్ అనిపిస్తుంది. తమిళనాడు రాజధాని అయినా చెన్నై లో ప్రజలకు నీటి కష్టాలు ఉన్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే చెన్నై వాసులకు ప్రభుత్వం రైళ్ల నుంచి కూడా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చెన్నై ప్రజలు దాహం తీర్చడానికి ఆ నీరు సరిపోవటం లేదు. దీనితో తమిళ నాడు ప్రభుత్వం ఏపీ సహాయాన్ని పొందాలని నిర్ణయించింది. 


తమిళ నాడు సీఎం పళని స్వామీ.. తన ఇద్దరి మంత్రులను జగన్ ను కలవమని అమరావతికి పంపించారు. ఇద్దరు మంత్రులు జగన్ ను కలిసి తమ నీటి కష్టాలను చెప్పుకొచ్చారు. దీనితో జగన్ స్పందిస్తూ తమిళ నాడుకు ఖచ్చితంగా సహాయం చేస్తామని చెబుతూ, ఏపీ అధికారులను జగన్ ఆదేశించారు. తక్షణమే తమిళ నాడుకు మనం ఏ విధంగా సహాయం చేయగలమో త్వరగా తెలియజెప్పాలంటూ ఆదేశించారు. దీనితో తమిళ నాడు మంత్రులు జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. అయితే జగన్ సీఎం గా పక్క రాష్టాలతో ఇలా స్నేహ సంభందాలు పెట్టుకోవటం మంచి శుభ పరిణామమని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: