కొన్ని విషయాలు చరిత్రలో జరిగినవి మనం పెద్దగా పట్టించుకోము. మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయదు. అలాంటిదే ఇప్పుడు మీరు వినబోయేది. ఐక్యరాజ్య సమితి .. కాశ్మీర్ విషయంలో అప్పుడు మధ్యవర్తిత్వం చేసిన సంగతీ తెలిసిందే. కాశ్మీర్ విషయంలో రెండు దేశాలు కాల్పులకు తెగబడినపుడు అప్పటి భారత ప్రధాన మంత్రి నెహ్రు ఐక్యరాజ సమితికి ఒక లేఖ రాశారు. రెండు దేశాల మధ్య ఏదైనా కాల్పులు జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి .. రెండు దేశాల్లో ఉండి పరిస్థితిని చక్కదిద్దుతుంది .  అంటే భారత్ లో అయితే ఢిల్లీలో ఒక బృందం ఉంటుంది. పాకిస్తాన్ లో ఇంకొక బృందం ఉంటుంది. అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే మిలిటరీ అన్న మాట. 


అయితే 1972 లో భారత్  పాకిస్థాన్ మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ విషయంలో ఇరు దేశాలు మాత్రమే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిశ్చయించుకున్నాయి. వేరే థర్డ్ పార్టీ ఈ విషయంలో చెప్పడానికి ఏమి ఉండకూడదని ఈ ఒప్పందం యెక్క ఉద్దేశం. ఈ ఒప్పందం ప్రకారం ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ విషయంలో ఏమి చెప్పడానికి వీలు లేదన్న మాట. 


అయినా ఐక్యరాజ్య సమితి రెండు దేశాల్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో, రెండు దేశాల స్వంత ఖర్చులతో ఐక్యరాజ్య సమితి బృందాన్ని మైంటైన్ చేసేవి. కాశ్మీర్ లో ఏదైనా ఇరు దేశాల మిలిటరీ మధ్య కాల్పులు జరిగినప్పుడు భారత్ ఐక్యరాజ్య సమితికి ఏమి చెప్పేది కాదు. ఎందుకంటే సిమ్లా ఒప్పందం ప్రకారం థర్డ్ పార్టీకి ఎటువంటి సంభందం లేదు కాబట్టి, కానీ పాకిస్తాన్ మాత్రం ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేస్తూ ఉండేది. అయితే ఇప్పుడు కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాబట్టి .. భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిని వెళ్లి పొమ్మని లేఖ రాయటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: