బంగారం అంటే భారతీయులకు ఎంతటి అభిమానమో చెప్పక్కర్లేదు.  చేతిలో కాస్త డబ్బు ఉంటె చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.  బంగారం కొనేసి దాచుకుంటారు.  ఇండియాలో సగటు భారతీయుడు తన సేవింగ్స్ ను బంగారం రూపంలో జమ చేస్తుంటాడు.  అందుకే ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.  


ప్రపంచంలో బంగారాన్ని దిగుమతి చేసుకునే వాళ్లలో ఇండియా టాప్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం దిగుమతి అవుతుంది.  ఇండియాలో ఉత్పత్తి అవుతున్నా.. విదేశాల నుంచే ఎక్కువ దిగుమతి అవుతుంది.  గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ స్థాయికి చేరుకోవడంతో..దీని ప్రభావం ఇండియా మార్కెట్ పై పడింది.  


ఇక్కడ రేట్లు అమాంతం పెరిగాయి.  రేట్లు పెరిగినప్పటికీ బంగారం కొనడం మాత్రం తగ్గలేదు.  జ్యువెలరీ మార్కెట్స్  నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు అదుపులోకి రావడం లేదు.  అటు వెంటి ధర కూడా కొండెక్కింది.  ధరలు మండిపోతున్నాయి.  ఒకవైపు నిత్యావసర ధరలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నా.. బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు.  


ఇదిలా ఉంటె, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర స్వల్పంగా తగ్గింది.  ఈ తగ్గింపుతో ఢిల్లీలో రూ. 50 రూపాయల మేర ధర తగ్గింది.  కానీ, హైదరాబాద్ మార్కెట్లో మాత్రం ఈ ధర తగ్గలేదు.  హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండటంతో ధరలు తగ్గలేదని అర్ధం అవుతున్నది.  హైదరాబాద్, విజయవాడలో మాత్రం పాత ధరలే కంటిన్యూ అవుతున్నట్టు సమాచారం.  వెండి ధరలు అంతర్జాతీయంగా ఎంత ఉన్నాయో అవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా బంగారం ధరలు మరలా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: