ఇప్పుడు బీజేపీకి దేశంలో ఎంత  పేరు వచ్చిందో చెప్పక్కర్లేదు.  ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజనతో మంచి పేరు తెచ్చుకుంది.  కాంగ్రెస్ పార్టీ చేయలేని సాహసం బీజేపీ చేసింది.  అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం వచ్చింది.  అప్పుడు కాంగ్రెస్ తలచుకుంటే ఆర్టికల్ 370ని రద్దు చెయ్యొచ్చు.  వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది.  కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం  చేయలేకపోయింది.  


ఎప్పుడైతే బీజేపీ మొదటిసారి పార్లమెంట్ లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచే జమ్మూ కాశ్మీర్ పై కన్నేసింది.  అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు గెలుచుకోవడంతో పార్టీ అక్కడ పట్టు సాధించింది. పైగా ప్రధాని మోడీ అక్కడ పలుమార్లు సభలు నిర్వహించారు.  ఆ సభలకు ప్రజలు విశేషంగా హాజరయ్యారు.  అక్కడి పరిస్థితులను అప్పటి నుంచే అర్ధం చేసుకుంటూ వచ్చిన పార్టీ, క్రమంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చింది.  


రెండోసారి అధికారంలోకి రాగానే పార్టీ మొదట త్రిపుల్ తలాక్ ను రద్దు చేయడంతో ముస్లిం మహిళలకు దగ్గరయ్యారు.  ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో పార్టీని దేశంలో మరింత బలోపేతం చేస్తున్నారు.  ఇప్పుడు బీజేపీ కన్ను తెలుగు రాష్ట్రాలపై పడింది.  ముఖ్యంగా తెలంగాణమీద.  తెలంగాణలోని బడా నేతలు బీజేపీ వైపుకు చూస్తున్నారు.  పార్టీలో జాయిన్ అవుతున్నారు.  తెలంగాణాలో బలమైన నాయకుల్లో ఒకరైన వివేక్ బీజేపీలో జాయిన్ కావడంతో పార్టీకి కొంతమేర బలం చేకూరినట్టైంది.  


వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణాలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 15 స్థానాలు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నది.  మిషన్ 15 పేరుతో పనిచేయడం మొదలు పెట్టింది.  హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ముస్లింలు అధికంగా ఉంటారు.  అక్కడ మరో పార్టీ గెలవడం కష్టమే.  కానీ, ఇప్పటి నుంచి పార్టీ అక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తే.. తప్పకుండా ఆ స్థానాన్ని కూడా దక్కించుకోవచ్చు.  మెదక్ లో హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆ స్థానం మరొకరికి వెళ్లడం కష్టం.  హరీష్ రావును కూడా పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెటింది.  మరి బీజేపీ ఆశలు నెరవేరుతాయా చెప్పండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: