నిన్న విజయవాడలో జరిగిన విదేశీ ప్రతినిధుల సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క వాస్తవ పరిస్థితిని విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రమని అయినప్పటికీ 6 ఎయిర్ పోర్టులు, 4 నౌకాశ్రయాలు, 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బలాలని సీఎం జగన్మోహన్ రెడ్డిగారు వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహర్ రెడ్డిగారు సదస్సులో చేసిన వ్యాఖలపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు. 
 
డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రమని మీరు చెప్పారు. మా మీద కోపంతో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి చెప్పకపోతే పెట్టుబడులు రావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, ఆరోగ్య సూచి విషయంలో దేశంలోనే రెండవ స్థానంలో ఉందని, పట్టిసీమ ద్వారా రెండు నదులను కలుపుతూ నీటి కొరత లేకుండా చేసామని గర్వంగా చెప్పండి. 
 
ప్రకృతి వ్యవసాయానికి ప్రాముఖ్యతనిచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని, సాంప్రదాయక ఇంధర వనరుల వాడకంలో నెంబర్ 1 అని గర్వంగా చెప్పండి. భారత దేశంలో 5 ఫోన్ లు తయారవుతుంటే 3 ఫోన్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్నాయని గర్వంగా చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అపారమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయని ఇండియా స్కిల్స్ అనే రిపోర్ట్ చెప్పిందని గర్వంగా చెప్పండి. 
 
మన రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ గురించి గొప్పగా చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. ఇలా మన రాష్ట్రం గురించి గొప్ప విషయాలు చెబితే నాలుగు కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతాయి. ఇలాంటి గొప్ప విషయాలు చెప్పకుండా ఇన్ని సీట్లు గెలిచాం అన్ని సీట్లు గెలిచామని చెబితే పెట్టుబడులు రావని నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: