రాజకీయాల్లో శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది నూటికి నూరు శాతం నిజమే. అప్పటివరకూ వేరు వేరు పార్టీలలో ఉంటూ ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకునే నేతలు తెల్లారేసరికి ఒకే పార్టీలో ఉంటారు. అలా ఒకప్పుడు గురు-శిష్యులుగా మెలిగిన ఇద్దరు నేతలు మధ్యలో శత్రువులుగా మారి, మళ్ళీ మిత్రులయ్యారు. ఇలా మారిన గురు-శిష్యులు ఎవరో కాదు ఒకరు గుత్తా సుఖేందర్ రెడ్డి కాగా, మరొకరు కంచర్ల భూపాల్ రెడ్డి. ప్రస్తుతం వీరు టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు.


మడ్ల గ్రామం. మొదట సిపిఎంలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇక టీడీపీలో కంచర్ల భూపాల్ రెడ్డి, గుత్తాకి అండగా నిలబడ్డారు. అయితే గుత్తా హఠాత్తుగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. కానీ కంచర్ల మాత్రం టీడీపీలోనే ఉన్నారు.  ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరం పెరిగింది. 2009లో గుత్తా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కంచర్ల నల్గొండ టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కంచర్లకి సంబంధించిన కాంట్రాక్ట్ పనుల బిల్లులు పాస్ అవ్వకుండా గుత్తా అడ్డుపడ్డారు.


2014లో మరోసారి గుత్తా ఎంపీగా గెలిచారు. ఇక కంచర్లకి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో నల్గొండ అసెంబ్లీ నుంచి స్వంతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు గుత్తా తెరవెనుక ఉండి కంచర్ల ఓటమికి కృషి చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజయం వచ్చేలా చేశారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. గుత్తా ఆ వెంటనే టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కంచర్ల కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గుత్తాకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిన వినియోగించుకోలా, అలాగే ఎంపీగా కూడా అవకాశం రాలేదు.


దీంతో కేసీఆర్ గుత్తాకి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ పదవులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో గుత్తాకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమైంది. మొత్తానికి గురువు ఎమ్మెల్సీ పదవి, శిష్యుడు ఎమ్మెల్యే పదవులో సెటిల్ అయ్యారు.   ఇలా గురు-శిష్యుల స్టోరీ అనేక మలుపులు తిరుగుతూ ఇలా సెటిల్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: