కాంగ్రెస్ పార్టీ .. దేశానికీ స్వాతంత్రం తెచ్చిందని భారత ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ సోనియా గాంధీ  రాహుల్ గాంధీ చేతిలో చిక్కుకొని బ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క పార్టీ అధోస్థితిలో ఉన్న ఇంకా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతుంది. అయితే నిన్న జరిగిన ప్రణబ్ ముఖర్జీ .. భారత రత్న కార్యక్రమానికి సోనియా గాంధీ  రాహుల్ గాంధీ ఇద్దరు హాజరు కాకపోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసం అయ్యింది. ప్రణబ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. కానీ ఎక్కడ ప్రణబ్ ముఖర్జీ తమకు అడ్డు వస్తాడని సోనియా గాంధీ తనను ప్రధానిని కాకుండా అడ్డుకొని చివరికి రాష్ట్ర పతి పదవిని ఇచ్చి తనను సైడ్ చేసింది. 


అయితే అయితే కరుడుగట్టిన ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న .. బీజేపీ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే బీజేపీ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడమంటే సాధారణ విషయం కాదు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని కూడా చెప్పలేదు. అయితే ప్రణబ్ ముఖర్జీ బీజేపీతో సన్నిహితంగా ఉండటం .. సంఘ్ పరివార్ మీటింగ్ లో పాల్గొనడం ఇవన్నీ కాంగ్రెస్ కు నచ్చ లేదు. 


అయితే ఇప్పుడు కాంగ్రెస్ .. ప్రణబ్ ముఖర్జీ భారత రత్న పురస్కార కార్యక్రమానికి హాజరు కాకపోవటం ఇప్పుడు చర్చనీయం అవుతుంది. తమ కాంగ్రెస్ కీలక నేతకు దేశ అత్యున్నత పురష్కారం ఇస్తూనే కనీసం రాకపోవటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇది వరకే పీవీ నరసింహం విషయంలో కూడా కాంగ్రెస్ ఇలానే ప్రవర్తించి చివరికి విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ .. ప్రతి పక్షాల చేతిలో విమర్శలకు గురి కాక తప్పదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: