అయోధ్య.. శ్రీరాముడు పుట్టిన ప్రాంతం.  ఇప్పుడు ఈ రామ్ జన్మభూమి గురించి గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నది.  ఈ వివాదం ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు.  శ్రీరాముడు పుట్టిన ప్రాంతంలో బాబ్రీ మసీద్ ఉండటంతో దానిని కూల్చివేశారు.  అప్పటి నుంచి అయోధ్య వివాదం దేశంలో అతిపెద్ద వివాదంగా పేరు తెచ్చుకుంది.  ఆ రోజు నుంచి హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  



ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టులో ఉన్నది.  సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసిన వాళ్ళు ఇప్పటికే మరణించారు.  ఇప్పుడు వారి వారసులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.  వివాదం మాత్రం పరిష్కారం కావడం లేదు.  ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న జమ్మూ కాశ్మీర్ సమస్యను ఎట్టకేలకు పరిష్కరించారు.  రెండు దేశాల మధ్య ఉన్న సమస్య పరిస్కారం అవుతుందిగాని, రెండు మతాల మధ్య ఉన్న ఈ సమస్య మాత్రం పరిస్కారం కావడం లేదు.  


ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే చాలా సమయం పట్టేలా ఉన్నది.  సుప్రీం కోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణ జరపాలని నిర్ణయించింది.  దీనిపై ఇరుపక్షాల వాళ్ళను వివిద రకాల ప్రశ్నలు వేస్తున్నది.  తాజాగా సుప్రీం ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్న రామ్ జన్మభూమి తరపున వాదిస్తున్న లాయర్ ను ఇరకాటంలో పెట్టింది.  అయోధ్యలో శ్రీరాముని వారసులు ఇప్పటికి ఉన్నారా.. ఉంటె వాళ్లెవరో తెలుసుకోవాలని ఉందని సుప్రీం కోర్టు అడిగింది.  


ఈ ప్రశ్నకు పాపం ఆ లాయర్ ఎలాంటి జవాబు చెప్పాలో అర్ధంకాలేదు.  హిందువులు దేవుళ్లను ఒక స్పష్టమైన ఆకారంతో పూజించరని, అవతారపురుషులుగానే పూజిస్తారని లాయర్ పరాశరణ్ పేర్కొన్నారు.  అయోధ్యలో రాముడి విగ్రహాన్ని పెట్టక ముందునుంచే, ఆలయాన్ని నిర్మించకముందునుంచే హిందువులు శ్రీరాముడిని అక్కడ ఆరాధిస్తూ వస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు.  సుప్రీం కోర్ట్ రోజువారీ విచారణకు ఈ కేసును తీసుకున్నాక.. అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూ వస్తున్నది. ఇకపై ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: