వైసిపి అధినేత, సీఎం జగన్ ఎంత నిరాడంబరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేపట్టక ముందు ఆయన ఆహార వ్యవహారాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఐడు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నారు. ఎక్కడా ఒక్క ఇంచ్ ఎక్స్ ట్రా ఆయనలో మనకు కనిపించలేదు. తాను చేయాల్సింది చేయడమే ఆయన పనితనం. అంతేకాదు, ఆయన న‌మ్మే మరో సిద్ధాంతం.. తాను చేసే పనికి పెద్దగా ప్రచారాన్ని కోరుకోక‌పోవ‌డం. పని చేసుకుంటూ పోతే ప్రచారం అదే వస్తుంది అన్న దివంగత వైఎస్ వ్యాఖ్యలను తూ.చ‌. తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక సీఎంగా ఆయన రికార్డు సృష్టిస్తున్నారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాధినేత రాష్ట్ర ప్రజల సొమ్మును ఎలా ఖర్చు పెట్టారో.. అందరికీ తెలిసిందే. కేవలం అంతర్గత సమావేశాల్లో మర్యాదపూర్వకంగా ప్లేట్లలో ఇచ్చే డ్రై ఫ్రూట్స్ ఖర్చు దాదాపు 8 కోట్ల రూపాయలు అయిందని ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు. ఆ సమయంలో సభలోనే ఉన్నప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు ఒక్క మాటంటే ఒక్క మాటకానీ, ప్రతి వ్యాఖ్యకానీ చేయలేకపోయారు. ఇలాంటి దుబారా వ్యయాలు ఆయనకు కొత్త కాదు. ఆయన తాగే ఆర‌లీట‌రు మంచి నీరు రూ. 80. ఇక, ఆయన మంత్రివర్గ సమావేశాలు, కలెక్టర్ల సదస్సులు వంటివాటికి ఐదు నక్షత్రాల హోటళ్లు ఉండాల్సిందే.


అయితే, తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ ఎంత మేరకు ఖర్చులు తగ్గించుకోవాలో.. అంత మేరకు తగ్గించుకున్నారు. తను తగ్గేందుకు ఒక కంపెనీ నీళ్లు, పక్క వారు తాగేందుకు మరో కంపెనీ నీరు ఆయన కొనుగోలు చేయలేదు. అందరికీ ఒకే విధంగా అరలీటరు నీటిని రూ.4కే కొనుగోలు చేసుకున్నారు. ఇక‌, డ్రైఫ్రూట్ల‌ తరహా సంప్రదాయాన్ని తక్షణమే రద్దు చేశారు. వాటి స్థానంలో రెండు బిస్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఐఏఎస్‌ల‌ సదస్సులో కూడా భారీ తరహా భోజనాలకు బ్రేక్ వేశారు. కేవలం సాంబార‌న్నం, పెరుగు అన్నంతోనే సరిపెట్టారు. ఇలా సింప్లిసిటీకి మారు పేరుగా మారారు జ‌గ‌న్‌.


తాజాగా శుక్రవారం విజయవాడలో జరిగిన విదేశీ దౌత్యవేత్తల‌ పారిశ్రామిక సదస్సు లోనూ తన సింప్లిసిటీ మరిచిపోలేదు. లేదా విదేశీయుల ముందు సింపుల్‌గా ఉండేందుకు నామ‌ర్థాగా కూడా భావించలేదు. తన ఖర్చులు తగ్గించుకునేందుకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ దుస్తుల్లోనే అతి పెద్ద, ప్రతిష్టాత్మక స‌ద‌స్సులో ఆయన హాజరయ్యారు. అదే సమయంలో విదేశీయులకు గౌరవం ఇవ్వడంలో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయ‌లేదు. వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తూనే.. సొంత ఖ‌ర్చులు తగ్గించుకున్నారు. విదేశీయులకు కప్పుల్లో టీ ఇచ్చిన జగన్.. తాను మాత్రం స్టీల్ గ్లాస్‌లోనే తీసుకుని నిదర్శనంగా నిలిచి అందరిని అబ్బురపరిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: