ఏపిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అకండ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కార్యకలాపాలు అమరావతి నుండే జరుపుతున్నారు.  ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయాల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.  గతంలో ఆయన హైదరాబాద్ నుంచి తన పార్టీ కార్యకలాపాలు చేస్తూ పార్టీ ప్రతిష్ట పెంచారు.  ఏపీలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఫలితం ఎన్నికలపై బాగా పడింది..దాంతో ఆయన ముఖ్యమంత్రి పీఠం అధీష్టించారు. 

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాలన చూస్తుంటే ప్రజల సంతోషాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అంతే కాదు గత పాలకుటు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు.  తన పాలనలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు ఉండటానికి వీల్లేదని, లంచగొండి తనం పూర్తిగా రూపుమాపాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించారు.

తాజాగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ఆఫీసులోని తన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత జగన్ రిబ్బన్ కట్ చేయించారు. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

తకు ముందు జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు.. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అమరావతిలో ముఖ్య కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని తన పార్టీ నేతలకు సూచించారు సీఎం జగన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: