జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే అధికరణలు...  ఆర్టికల్ 370అలాగే ఆర్టికల్ 35 ల ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ మరియు లఢక్ లను  కేంద్ర పాలిత ప్రాంతాలు గా ఇటీవల మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో  దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.  కాగా  కాశ్మీర్ వ్యవహారాన్ని ప్రపంచ దేశాల ద్రుష్టి కి తీసుకెళ్లి భారత్ ను తప్పుబట్టాలని  ఆశగా ఎదురుచూస్తుంది పాకిస్థాన్. అయితే ఈ విషయంలో పాక్ కు దెబ్బ మీద దెబ్బతగులుతుంది. ఇప్పటికే ఈ కాశ్మీర్ వ్యవహారంలో మధ్య వర్తిత్వం వహించాలన్న పాక్ అభ్యర్థనను ఐక్య రాజ్య సమితి  తిరిస్కరించగా తాజాగా కాశ్మీర్ విషయంలో  భారత్ కు మద్దతు తెలిపి పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది రష్యా. 


కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిస్వాగతిస్తూ  రష్యా ..  భారత రాజ్యంగబద్ధంగానే  ‘జమ్ముకశ్మీర్‌ హోదా మార్పు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని  అది అంతర్గత వ్యవహారమని వెల్లడించింది.  అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భారత్‌, పాక్‌ మధ్య  ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నామని  రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. అయితే భారత్ ను ప్రపంచ దేశాలకు దోషిగా చుపించాలనుకొనే ముసుగులో  పాక్  ఏకాకిగా మారుతుంది.  



కాగా జమ్మూ కాశ్మీర్ విభజన  నేపథ్యంలో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు చేసుకోకుండా  కేంద్ర పెద్ద సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను రంగం లోకి దించింది.అలాగే  కాశ్మీర్ లోని  సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. ఇక జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు చట్ట సభల్లో ఆమోదయోగ్యం లభించగా అక్టోబర్ 31నుండి జమ్ము కాశ్మీర్ మరియు లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: