ఆమంచి క్రిష్ణమోహన్ ఎన్నికల ముందు ఈ పేరు వింటే చంద్రబాబు గ్యాంగ్ కి కలవరమే. బాబు గుట్టుని రట్టుచేసిన ఘనత ఆమంచిదే. సీఎం పేషీలో ఉన్న అధికారులు, పోలీసుల్లో ఉన్న కమ్మ సామాజికవర్గం విషయాలు మీడియా ముందు ఎండగట్టి మొత్తానికి మొత్తం బాబు పరువు తీసేసిన నేత ఆమంచి. ఆమంచి పార్టీ మారి వైసీపీలో చేరడంతోనే వైసీపీకి ఒక్కసారిగా వూపొపిచ్చింది.  టీడీపీ దెబ్బకు డీలా పడిపోయింది. 


ఇక బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత ఆమంచి క్రిష్ణమోహన్. ఆయన వైఎస్ హయాంలో 2009లో గెలిచారు. 2014 నాటికి సొంతగా గెలిచారు. టీడీపీలో చేరినా అక్కడ ఇమడలేక జగన్ వైపు వచ్చేసారు. తాజా ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు వల్ల ఓటమి పాలు అయినా ఆమంచి కాపుల్లో బలమైన నేత. ఈ సంగతి జగన్ కి బాగా తెలుసు. అందుకే ఆయనకు పెద్ద పదవి రెడీ చేసి ఉంచారట.


కాగా ఈ రోజు ఓ చిత్రమైన విషయం జరిగింది.  గుంటూర్లోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆమంచి చేత ఏకంగా జగన్ దగ్గరుండి మరీ ఓపెన్ చేయించారు. ఆమంచి మీరు అధినేత, ప్రారంభం  మీరే చేయాలి అంటే అదికాదు అంటూ ఆమంచి చేత జగన్ ఈ ఓపెనింగ్ చేయించడాన్ని బట్టి  చూస్తే జగన్ మదిలో ఆమంచి పాత్ర ఏంటన్నది అందరికీ అర్ధమవుతుంది. ఆమంచి సేవలను పార్టీ కోసం వాడుకోవాలని జగన్ భావిస్తున్నారుట. 


 దానికి సంకేతంగానే ఈ రోజు ఆలా చేశారని అంటున్నారు. ఆమంచికి ఎమ్మెల్సీ పోస్ట్ ఖాయమని అపుడే టాక్ నడుస్తోంది. ఆ పదవితో పాటుగా మంత్రిని కూడా చేస్తారని అంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే అతి కీలకమైన నామినేటెడ్ పదవిలో ఆయన్ని కూర్చోబెడతారని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు, ఏపీలో వైసీపీకి అతి కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమంచిని వాడుకోవాలను జగన్ భావిస్తున్నారుట. మొత్తానికి ఆమంచి వాల్యూ సీఎం వద్ద ఒక్కసారిగా పెరిగిపోయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: