ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ఈ హత్యాచారాల నుంచి తప్పించుకోవడానికి మహిళలు రక్షణ కోసం అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.  ఎన్ని విద్యలు నేర్చుకుంటున్నా.. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా హత్యాచారాలు, హత్యలు తగ్గడం లేదు.  క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతున్నది.  దీని నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఫలితం లేకుండా పోతున్నది.  

మరి ఈ ఘటనల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.. యువతలో మార్పును తీసుకురావాలి.  ఇప్పుడున్న సొసైటీలో యువత ఆ విధంగా మారతారంటారా అంటే మారారు అనే చెప్పాలి.  మార్పు రాకుంటే.. ఇలానే జరుగుతుంది.  మహిళల అనుకుంటే పొరపాటే.. చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి.  క్షణికావేశంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మరి దీని నుంచి బయటపడటం కోసం గాదె హరీష్ అనే వ్యక్తి ఓవినూత్నంగా ఆలోచించాడు.  

మహిళల రక్షణ కోసం గాజులు తయారు చేశారు.  గాజులు ఏం చేస్తాయని అనుకోకండి.  ఆ గాజుల్లో కరెంట్ ఉంటుంది.  గాజులకు జీపీఎస్ ఎటాచ్ చేసి ఉంటుంది.  పోలీసులకు మెసేజ్ వెళ్లే విధంగా పోగ్రామ్ అందులో డిజైన్ చేసి ఉంటుంది.  కిడ్నాప్ చేయడానికి లేదా హత్యాచారం చేయడానికి ప్రయత్నించినపుడు గాజు అతని చేతిని తగలగానే షాక్ కొడుతోంది.  వెంటనే డివైజ్ ఆన్ అవుతుంది.  

ముందుగానే అందులో ప్రోగ్రాం డిజైన్ చేసినట్టుగా నలుగురికి మెసేజ్ వెళ్తుంది.  జజీపీఎస్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చెయ్యొచ్చు.  కిడ్నాప్ చేసిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళను మ్యాప్ ద్వారా ట్రాక్ చెయ్యొచ్చు.  ఈజీగా పెట్టుకోవచ్చు.  ప్రస్తుతం ఈ గాజు డివైజ్ ప్రోటోటైప్ డివైజ్.  సపోర్ట్ దొరికితే చిన్నదిగా తయారు చేసేందుకు వీలైతుందని అంటున్నాడు.  ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే తప్పకుండా కొంతవరకు హత్యాచారాలను, హత్యలను  అరికట్టవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: