జమ్ముకాశ్మీర్‌ వ్యవహారంలో అన‌వ‌స‌రంగా రంకెలు వేస్తున్న పాకిస్తాన్‌కు షాకులు కొన‌సాగుతున్నాయి.  ఇప్పటికే కాశ్మీర్‌ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఐక్యరాజ్య సమితి, చైనా తేల్చి చెప్పగా... అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రష్యా సమర్థించింది. ఈ విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, రాజ్యంగబద్ధంగానే కశ్మీర్‌ లో మార్పులు జరిగాయని పేర్కొంది. 


భార‌త్ త‌న సొంత దేశానికి సంబంధించిన జ‌మ్మూక‌శ్మీర్ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యం విష‌యంలో...పాకిస్తాన్ గుడ్డి వ్య‌తిరేక‌త‌తో తన చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల గుండా నడిచే రెండు రైళ్ల సేవలను నిలిపివేయగా.. తాజాగా ఢిల్లీ-లాహోర్‌ మధ్య బస్సు సర్వీసును కూడా రద్దు చేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ మంత్రి మురద్‌ సయీద్‌ వెల్లడించారు. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్‌ మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఇండియా గేట్‌ సమీపంలోని అంబేడ్కర్‌ స్టేడియం టర్మినల్‌ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో బస్సులు లాహోర్ వెళ్తాయి. పాకిస్థాన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కూడా బస్సు సర్వీసు నడుపుతోంది. ఈ బస్సు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఢిల్లీ నుంచి లాహోర్‌ బయల్దేరుతుంది.


కాగా,పాక్‌కు ఏ ఒక్క‌దేశ‌మూ మ‌ద్ద‌తివ్వ‌డం లేదు. ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోబోమ‌ని ర‌ష్యా తెలిపింది. 1972 నాటి సిమ్లా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే భారత్-పాక్ మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. కశ్మీర్‌పై తమ విధానంలో ఏ మార్పులేదని అమెరికా పునరుద్ఘాటించింది. ఇటీవలి పరిణామాలపై భారత్-పాక్ సంయమనం పాటించాలని, ప్రత్యక్ష చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. కశ్మీర్ పూర్తి గా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని అమెరికా అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ గురువారం తెలిపారు. కశ్మీర్‌పై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించు కునేందుకు అమెరికా పూర్తి మద్దతుని స్తుందన్నారు. అమెరికా ప్రతినిధి ఒకరు వచ్చేవారం భారత్‌లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో పరిస్థితులను తాము గమనిస్తున్నామ న్నారు. భారత్-పాక్‌తో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన కేవలం కశ్మీర్ ప్రాధాన్యంగా సాగలేదు. ఇతర అంశాలపై నా మేం చర్చిం చాం. మాకు భారత్‌తో ఉన్నట్టే పాక్‌తో కూడా సత్సంబంధాలున్నాయి అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: