జేడీ లక్ష్మీ నారాయణ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జేడీకి చాలా పార్టీలు ఆహ్వానించినా .. జేడీ మాత్రం జనసేన లో చేరారు. ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఓడిన సంగతీ తెలిసిందే. జేడీ లక్ష్మి నారాయణ సీబీఐ ఆఫీసర్ గా దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను డీల్ చేశారు. సత్యం కేసు కావొచ్చు .. గాలి జనార్దన్ రెడ్డి కేసు కావొచ్చు ఇలా చెప్పుకుంటూపోతూ దేశంలో ఎన్నో సంచలనం రేపిన కేసులను డీల్ చేసి మంచి అధికారిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అయితే జేడీకి ఎన్ని కేసులను డీల్ చేసినా రాని గుర్తింపు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కేసును డీల్ చేయడంతో ఎక్కడ లేనిహైప్ వచ్చింది.


హైప్ వచ్చింది అనటం కంటే పచ్చ మీడియా ఎక్కువ ఉత్సాహం చూపించి, జగన్ ను విలన్ గా చూపించే క్రమంలో జేడీని వీరుడు, సూరుడు అంటూ తన పచ్చ పైత్యాన్ని బయట పెట్టిందని చెప్పాలి . కేసు వివరాలు జేడీ బయట పెట్టకముందే పచ్చ మీడియా వాటిని బయటపెట్టి నానా హంగామా చేసేది. అయితే ఇవన్నీ పక్కన పెడితే జేడీ మహారాష్ట్ర పోలీసు విధుల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోని రాజకీయాల్లోకి వచ్చిన సంగతీ తెలిసిందే.


మొదట్లో రాష్ట్రం మొత్తం తిరిగి రైతులతో సమావేశం అయ్యి, వ్యవసాయ సమస్యలను తెలుసుకొని అప్పటి సీఎం అయినా చంద్రబాబుకు తెలియజేశారు. అయితే జేడీని తమ పార్టీలోకి రావాలని ఇటు టీడీపీ నుంచి అటు జనసేన నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ చివర్లో జనసేన లో జేడీ చేరినారు. అయితే చివర్లో ఎన్నికల ముందు జనసేనలో చేరిన జేడీ విశాఖ పట్టణం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. అయితే జనసేనలో జేడికి సరైనా ప్రాధాన్యత దక్కడం లేదని .. జనసేన పార్టీ పరిస్థితి కూడా ఘోరంగా ఉండటంతో జేడీ పార్టీ మారాలని అనుకుంటున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: