డిస్కవరీ చానల్‌లో వచ్చే ప్రముఖ అడ్వెంచర్ ప్రోగ్రామ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌.  ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి కనిపించబోతున్నారు..ఆయన ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ.  ఆ షో హోస్ట్(వ్యాఖ్యాత) బేర్ గ్రిల్స్ ప్రధానిని ఇంటర్వ్యూ చేశారు. ఈ కార్యక్రమాన్ని 180కి పైగా దేశాల్లో ఆగస్టు 15వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ చానల్ ప్రసారం చేయనున్నది.

ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఈ చిత్రీకరణ జరిపినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎపిసోడ్ ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది.  ఈ ప్రోమో వీడియోలో నదిలో మోదీ ప్రయాణం, అడవిలో మృగాల నుంచి కాపాడుకునేందుకు గిరిజనులు వాడే బరిసెలను చేతబట్టి ఉన్న మోదీ తదితర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. 


తాజాగా  ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ సాహస యాత్రలో భాగంగా ప్రధాని మోదీ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉన్నారని కొనియాడారు. తన వెంట ఓ ప్రధాని హోదాలో కాకుండా సామాన్య సాహసీకుడిగా జర్నీ చేశారని అన్నారు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎక్కడ బెరుకు లేకుండా ఉల్లాసంగా కనిపించారని పేర్కొన్నాడు. ఏమాత్రం అనుకూలించని వాతవరణంలో మోదీ ఆత్మస్థయిర్యం చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని అన్నారు.

కృతి మనకు ఓ వరం..అలాంటి ప్రకృతి అందాలు ఆస్వాదించడం..అక్కడి వన్యప్రాణులను వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.  తన యాత్రలో ఎంతో మందిని కలిశానని, కానీ మోదీ లాంటి మహాన్నతమైన వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాజకీయ నాయకులు ప్రజాజీవనంలో సూటూబూటూ ధరించి స్మార్ట్ గా ఉంటారు. అడవిలో వారు అంకితభావానికి, తెగువకు అది మురిసిపోతుంది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో భారత ప్రధాని మోదీ, నేను ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం.

మా సాహసయాత్రను చిత్రీకరించే బృందం కూడా కొన్నిసార్లు ప్రమాదం అంచున నిలిచింది.  ప్రధాని మోదీ, నేను ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం. భారీ వర్షాల నడుమ, జలపాతాల్లో పెద్ద పెద్ద బండరాళ్లను ఢీకొన్నాం. మోదీ ప్రపంచస్థాయి నాయకుడు అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: