మూడు ఫార్మాట్లకు ఒకే జట్టు అవసరం

 

భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ వన్డే t 20  అనే 3 ఫార్మాట్లకు ఒకే బృందం ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్య రహానే అన్నాడు.   కొన్ని వర్గాల వారిని లేదా కొంతమందిని ఆనందింపజేయడానికి జట్టు ఎంపిక చేయడం సరి కాదన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలను తాను   అంగీకరిస్తున్నట్లు తెలిపాడు.  

జట్టులో స్థానం కోసం ఆశించే యువ క్రీడాకారులు చాలామంది ఉన్నారని అలాగే ఒకసారి ఎంపికైన క్రీడాకారుడికి తన సామర్ధ్యం నిరూపించుకునే వరకూ తగినన్ని అవకాశాలు ఇవ్వాలని తరచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటే యువ క్రీడాకారుల ఆత్మవిశ్వాసం దారుణంగా దెబ్బతింటుందని తెలిపాడు.

 సాంకేతికత అనేది చాలా ముఖ్యం అని ఒక ఆటగాడు తన సాంకేతికతను మెరుగుపరుచుకోవాలంటే టెస్ట్ క్రికెట్ అనేది ఒక అత్యుత్తమమైన వేదిక అని ఆయన తెలియజేశాడు సుదీర్ఘ కాలం జట్టులో లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడడం అంత సులువు కాదని, యువ క్రీడాకారులు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి అనేక సవాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నాడు.

 తన ఆటతీరు మిగతావారికన్నా కొంచెం భిన్నమని,  టెస్ట్ క్రికెట్లో కుదురుకుంటే మిగతా ఫార్మెట్లో  ఆడటం చాలా తేలికవుతుంది అని అన్నాడు. తనపై టెస్ట్ క్రీడాకారుడిగా ముద్ర వేయడం తగదని ఐపీఎల్ లో కూడా తాను ధాటిగా ఆడి సెంచరీలు చేసిన విషయం గుర్తుచేశాడు.

 యువ క్రీడాకారులకు తగినన్ని అవకాశాలు ఇస్తే భారత క్రికెట్ జట్టు ప్రపంచ క్రికెట్లో ఒక బలీయమైన  అజేయ శక్తిగా నిలుస్తున్నాడు



మరింత సమాచారం తెలుసుకోండి: