ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చాలా వరకు దెబ్బతిన్నది.  2014 లో బలంగా ఉన్న పార్టీ ఐదేళ్ళలో పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.  2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది.  మరోవైపు వైకాపా 151 స్థానాలు గెలుచుకోవడంతో బలంగా మారింది.  తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోంది.  ఇప్పుడు ప్రజలలోకి వెళ్లగలిగే సత్తా ఉన్న నాయకులు కావాలి.  చంద్రబాబుకు ఇప్పటికే వయసు మీదపడింది.  



ఈ సమయంలో బాబు ఎక్కువగా తిరగలేరు.  మరోవైపు లోకేష్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ ఎలా మారుతుందో అని భయపడుతున్నారు.  గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓటమిపాలయ్యారు.  ఈ సమయంలో లోకేష్ కు బాధ్యతలు అప్పగించలేరు. అప్పగిస్తే జరిగే పరిణామాలు ఏంటో బాబుకు తెలుసు.  



లోకేష్ కు బాధ్యతలు అప్పగించి తప్పు చేయాలనీ బాబు అనుకోవడం లేదు.  ఒకవేళ బయట వ్యక్తులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో బాబుకు తెలుసు.  అందుకే బాబు ఆలోచనలో పడ్డాడు.  ఎలాగైనా పార్టీని తిరిగి బలోపేతం చేయాలనీ చూస్తున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి కొంతమేరకు బలపడేలా చూడాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది.  



వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన పరిస్థితిని కొనసాగిస్తే... ఇబ్బంది పడాల్సి వస్తుంది.  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో చూస్తూనే ఉన్నాం.  ఇప్పుడు తెలుగు దేశం పార్టీ విషయంలో కూడా అదే విధమైన పరిస్థితులు రావొచ్చు.  ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. తప్పకుండా పార్టీ బలపడాలి.  వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి.  మెరుగైన ఫలితాలు సాధించాలంటే మెరుగైన నాయకత్వం ఉండాలి.  మెరుగైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నదా అంటే కాలమే నిర్ణయిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: