నాయకుడు ఎలా ఉండాలి.. నాయకుడు తన వాళ్లను ఎలా కాపాడుకోవాలి.. నాయకుడు.. తన వాళ్లను ఎంత గౌరవంగా చూసుకోవాలి.. నాయకుడు తనవాళ్లకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలి.. ఈ ప్రశ్నలకు జగన్ సమాధానంగా నిలుస్తున్నాడు. శనివారం తాడేపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ తానేంటో చెప్పకనే చెప్పాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడే ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత రిబ్బన్ కటింగ్ కూడా ఉంది.


అంతా జగన్ ను రిబ్బన్ కట్ చేయమని ఆయన చేతిలో కత్తెర పెట్టారు. అదే సమయంలో కాస్త దూరంలో నిలుచున్న చీరాల వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. జగన్ వైపు పలకరింపుగా చేయి చాచారు. ఆయన చేతిని ఆప్యాయంగా అందుకున్న జగన్.. అనూహ్యంగా ఆయన చేతిలోనే కత్తెర పెట్టారు. అప్పటికే ఆయన పక్కన ఎంపీ నందిగం సురేశ్ ఉన్నారు.


జగన్ చొరవగా.. అటు ఆమంచి కృష్ణమోహన్, ఇటు నందిగం సురేశ్ .. ఇద్దరి చేతులూ కలిపి.. వారితోపాటు తాను రిబ్బన్ కటింగ్ చేశాడు. చూసేందుకు ఇది చాలా చిన్న దృశ్యమే.. కానీ జగన్ మనస్తత్వం ఏంటో సింపుల్ గా చెప్పే సంఘటన. వాస్తవానికి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు.. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి ఓడిపోయాడు.


కానీ జగన్ తాను నమ్మితే.. గెలుపోటములతో పని ఉండదని.. విశ్వాసం, నమ్మకం ఇవే తనకు ముఖ్యమని ఈ ఘటనతో చెప్పకనే చెప్పేశాడు. ఇందులో మరో కోణం కూడా ఉంది. పార్టీ కార్యాలయాన్ని ఓవైపు దళిత నాయకుడు..మరోవైపీ బీసీ నాయకుడు.. ఆ ఇద్దరితో రిబ్బన్ కటింగ్ చేయించడంలో సామాజిక కోణం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: