కాశ్మీర్ ను భారత్ పూర్తిగా తమ భూభాగంలో పూర్తిగా కలిపేసుకోవటంతో పాకిస్తాన్ కడుపు మండిపోయింది. జోక్యం చేసుకోవాలంటూ ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ అన్నీ దేశాలను అడిగినారు. కానీ ఏ దేశం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు రష్యా కూడా భారత్ కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది. కాశ్మీర్ ను భారత్ తన రాజ్యాంగానికి లోబడి భూభాగంలో కలిపేసుకుంది అని ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. దీనితో పాకిస్తాన్ కు మిగతా దేశాలతో పాటు రష్యా కూడా షాక్ ఇవ్వటం ఆసక్తిని రేపుతోంది. భారత్ లాంటి దేశం అమెరికా హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా .. భారత్ నుంచి  S 400 మిస్సైలను కొనుగోలు చేసింది. అలాంటిది రష్యా భారత్ కు కాకుండా పాకిస్తాన్ కు ఎందుకు సపోర్ట్ చేస్తుందని డిప్లొమాట్స్ చెప్పుకొచ్చారు. 


ఇప్పుడు ఏ దేశం కూడా పాకిస్థాన్ మాటలు విని ఇప్పుడు భారత్ ను ప్రశ్నించే సాహసం చేయదు. ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరిగా తయారైంది. ఆర్ధికంగా చితికిపోయిన దేశం. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ముద్ర పడిన దేశం పాకిస్తాన్. అలాంటి దేశం కోసం ఏ దేశం కూడా ఇండియాతో సున్నం పూసుకోవాలని అనుకోదు. పైగా ఇప్పుడు ఇండియా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలను అందుకున్నది.


ఇటు ఆర్ధికంగా కావొచ్చు, దేశంలో నిపుణుల పరంగా కావొచ్చు. భారత్ ఎన్నో విషయాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించింది. చివరికి చైనా కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడం లేదంటే .. మిగతా దేశాలు భారత్ కు ఎంత విలువను ఇస్తున్నాయో అర్ధం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో చైనా .. పాకిస్తాన్ కోసం భారత్ తో ఆర్ధిక సంభందాలను వదలుకునే పరిస్థితిలో లేదని చెప్పాలి. అందుకే చైనా కూడా భారత్ కే జై కొట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: