కాశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తుంది. ఈ విషయంలో సహాయం చేయమని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అభ్యర్ధించిన ఏ దేశం కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఇది భారత్ యెక్క అంతర్గత వ్యవహారమని అన్నీ దేశాలు తేల్చి చెప్పాయి. చివరికి ఇస్లాం దేశాలుగా చెప్పుకునే సౌదీ అరేబియా, టర్కీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పడంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో అర్ధం గాని పరిస్థితి. పోనీ యుద్ధం చేద్దామనుకుంటే .. పనిలో పనిగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా ఆక్రమించుకుంటుందని పాక్ కు కూడా తెలుసు. దీనితో పాకిస్థాన్ డిఫెన్స్ లో పడింది. 


అయితే పాకిస్తాన్ కు మిత్ర దేశాలుగా చలామణీ అవుతున్న చైనా గాని, చివరికి రష్యా కూడా మేము జోక్యం చేసుకోబోమని చెప్పాయి. కాశ్మీర్ ను భారత్ తన రాజ్యాంగానికి లోబడి భూభాగంలో కలిపేసుకుంది అని ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. దీనితో పాకిస్తాన్ కు మిగతా దేశాలతో పాటు రష్యా కూడా షాక్ ఇవ్వటం ఆసక్తిని రేపుతోంది. భారత్ లాంటి దేశం అమెరికా హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా .. భారత్ నుంచి  S 400 మిస్సైలను కొనుగోలు చేసింది.


అలాంటిది రష్యా భారత్ కు కాకుండా పాకిస్తాన్ కు ఎందుకు సపోర్ట్ చేస్తుందని డిప్లొమాట్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మధ్యలోకి తాలిబన్లను లాగి భారత్ లోకి దాడికి పంపించాలని ప్లాన్ చేసింది. పార్లమెంట్ లో పాక్ ప్రతి పక్ష నేత మాట్లాడుతూ కాశ్మీర్ లో రక్త పాతం జరుగుతుంటే ఆప్ఘనిస్తాన్ లు ఊరుకుంటారా అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనితో వెంటనే తాలిబన్ల అధినేత మధ్యలోకి మమ్మల్ని లాగొద్దు అని పాకిస్తాన్ కు చెప్పడంతో పాక్ ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: