ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తరువాత ఆ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది అనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది.  మళ్ళీ ఏవైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నదా అనే దానిపై కూడా చర్చిస్తున్నారు.  ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాశ్మీర్ లో ప్రసుత్తం ఎలాంటి గొడవలు చోటుచేసుకోలేదు.  జమ్మూలో పూర్తిస్థాయిలో జనజీవనం బయటకు వచ్చింది.  స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యాయి.  దుకాణాలు తెరుచుకున్నాయి.  


కాశ్మీర్లో కూడా పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి.  144 వ సెక్షన్ అమలులో ఉన్నా.. దాన్ని సడలించారు.  ప్రజలు రోడ్డుమీదకు వస్తున్నారు.  కీలక సమస్యలున్నా ప్రాంతాలైనా సాంబా, రాజౌరి, అనంతనాగ్, బారాముల్లా, తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి మామూలుగానే ఉన్నది.  రాజకీయ నాయకులు ఇంకా గృహనిర్బంధంలోనే ఉన్నారు.  అక్టోబర్ 31 వ తేదీ నుంచి అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడక్ లు మారతాయి.  మిగతా రాష్టాల్లో అమలు చేస్తున్న కేంద్రం చట్టాలు ఇకపై జమ్మూ కాశ్మీర్ లో అమలు జరుగుతాయి.  


జమ్మూ కాశ్మీర్ పరిథిలో ఉన్న 153 చట్టాలు రద్దవుతాయి.  దీంతో పాటు గవర్నర్ పరిథిలో ఉన్న 11 చట్టాలు కూడా రద్దు అవుతాయి.  శాశ్వత నివాసిగా గుర్తింపు, భూబదలాయింపులు, కాశ్మీర్ స్త్రీ వివాదం వంటి వాటినిపై త్వరలోనే చట్టాలు చేయనున్నారు.  అక్టోబర్ 31 నుంచి అన్ని రాష్ట్రాలాగే జమ్మూ కాశ్మీర్ కూడా మారిపోతుంది.  కొంతమంది కావాలని కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయని వార్తలు పుట్టిస్తున్నారు.  ఇందులో ఎలాంటి నిజం లేదని కాశ్మీర్ అంతటా ప్రశాంతమైన వావతారణం నెలకొందని అక్కడి అధికారులు చెప్తున్నారు.  


రేపు ఈద్ సందర్భంగా 144 సెక్షన్ సడలించడంతో జమ్మూ కాశ్మీర్ అంతటా ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉంటె, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు.  అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాడు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని, అందరి హాయిగా ఉంటారని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇస్తున్నారు.  త్వరలోనే ఆ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: