రాజకీయాల్లో ఉన్నవి ..  లేనివి .. గాసిప్స్ సర్వ సాధారణం. ఒక నేత ఇమేజ్ ని ఎంతలా డామేజ్ చేస్తారో అంతలా చేస్తారు. అందులో నిజాలు ఉండొచ్చు .. ఉండకపోవచ్చు.. ఎందుకంటే ఒక సారి రాజకీయ నేత పబ్లిక్ లోకి వచ్చినప్పుడు జనాలు వంద అంటారు. అవన్నీ సర్వసాధారణం .. వాటికన్నింటికీ సిద్ద పడ్డాకే రాజకీయాల్లోకి రావాలి. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఇంకా మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు ఇంకా అర్ధం కావటం లేదు. రెండు రోజుల నుంచి మీడియాలో ఒకటే న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. అదే జనసేన పార్టీ నుంచి జేడీ లక్ష్మీ నారాయణ వెళ్ళిపోతున్నాడని, ఇదే వార్త తెలుగు మీడియాలో ప్రముఖంగా వినిపించింది.


జేడీ కి పార్టీలో తగిన గౌరవం లభించడం లేదని, జేడీకి పవన్ కళ్యాణ్ టైం కూడా కేటాయించడం లేదని, ఈ మధ్య జనసేన ప్రకటించిన కమిటీ లలో జేడీ పేరు లేకపోవటంతో నిజంగా జేడీ  ..  జనసేన పార్టీ నుంచి దూరం అవుతున్నాడని అందరూ భావించారు. జనసేన పార్టీ కార్య క్రమాల్లో కూడా జేడీ ఏమంతా యాక్టీవ్ గా కూడా కనిపించలేదు. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని ట్విట్టర్ లో జేడీ చెప్పారు. పని బాట లేని వారు ఫూల్స్ మాత్రమే ఇటువంటి న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారని ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. 


అయితే 2019 ఎన్నికల్లో జేడీకి చాలా పార్టీలు ఆహ్వానించినా .. జేడీ మాత్రం జనసేన లో చేరారు. ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఓడిన సంగతీ తెలిసిందే. జేడీ దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను డీల్ చేసి నిజాయతీ కలిగిన ఆఫీసర్ గా పేరు సంపాదించుకున్నారు. అయితే జేడీకి ఎన్ని కేసులను డీల్ చేసినా రాని గుర్తింపు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కేసును డీల్ చేయడంతో ఎక్కడ లేనిహైప్ వచ్చింది. హైప్ వచ్చింది అనటం కంటే పచ్చ మీడియా ఎక్కువ ఉత్సాహం చూపించి, జగన్ ను విలన్ గా చూపించే క్రమంలో జేడీని వీరుడు, సూరుడు అంటూ తన పచ్చ పైత్యాన్ని బయట పెట్టిందని చెప్పాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: