ప్రకృతి ఆరాధకుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఒక గొప్ప ప్రకృతి ఆరాధకుడు అని ఒక మంచి  సాహసికుడు అని మ్యాన్ వెర్సెస్ వైల్డ్ కార్యక్రమం నిర్వాహక బేర్ గ్రిల్స్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని కొనియాడారు.

 వన్యప్రాణులను సంరక్షించడానికి చిత్రీకరించిన ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కలసి పాల్గొన్నారు.  ప్రధాని మోడీని చూసి తమ బృందం సభ్యులు చాలా ఆశ్చర్యానందాలకు లోను అయ్యారని, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారని బేర్ గ్రిల్స్ అన్నారు. 

ఉత్తరాఖండ్  లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఈ కార్యక్రమం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో కలిసి పని చేసినప్పుడు  జరిగిన తన అనుభవాలను ఈ సందర్భంగా మనతో పంచుకున్నారు. బృంద సభ్యులు కూడా అక్కడ ఉండడానికి భయాందోళన కు గురవుతున్న సమయంలో కూడా శ్రీ నరేంద్రమోడీ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు ఈ చిత్రీకరణలో శ్రీ నరేంద్ర మోదీ ఉత్సాహంగా పాల్గొన్నారని  అన్నాడు. శ్రీ నరేంద్రమోడీ త్రికరణ జరుగుతున్నంతసేపు చాలా మౌనంగా ఉన్నారని తమతో కలసి అడవి అంతా తిరిగారని తన అనుభవాలను చెప్పారు.

అంత ప్రశాంతంగా,  మౌనంగా, ఉండగలుగుతున్నారు కనుకనే శ్రీ నరేంద్ర మోదీ తన విధి నిర్వహణలో ఎదురైనా అచంచలమైన నిబద్ధతతో పని చేయగలుగుతున్నారు అని  అన్నారు. అనన్య సామాన్యమైన మేధా సంపత్తి శ్రీ నరేంద్ర మోదీ సొంతమని, మౌనంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఇటువంటి కఠిన పరిస్థితి ఎదురైనా  తట్టుకుని నిలబడి ఉండడం సులువైంది అన్నారు. మొత్తం మీద శ్రీ నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి అని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: