సూపర్ స్టార్ రజినీకాంత్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ఫై స్పందిస్తూ .. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా లపై ప్రశంసలు కురిపించారు.   అమిత్ షా జమ్మూ కశ్మీర్  పరిస్థితిని  హ్యాండిల్ చేస్తున్న తీరు అద్భుతమని మోదీ -షా లను కృష్ణార్జున లతో పోల్చారు. అయితే ఎవరు కృష్ణుడు , ఎవరు అర్జునుడో మాత్రం చెప్పలేదు.  కాగా  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన ఈ వాక్యాలు చేశారు. 


అలాగే మిషన్ కాశ్మీర్ కొరకు  అమిత్ షా గారికి  నా  హృదయ పూర్వక  శుభాకాంక్షలు.  పార్లమెంట్ లో ఆయన ప్రసంగం అద్భుతం. భవిష్యత్తులో  ఆయనకు అన్ని శుభాలే కలగాలని కోరుకుంటున్నానని వాఖ్యానించిన  రజినీ కాంత్  ఆతరువాత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫై   ప్రశంసలు కురిపించారు.  వెంకయ్య గారు  ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు.  ఆయనోగొప్ప ఆధ్యాత్మిక వేత్త’ అని రజినీ కాంత్ ఈ సందర్భంగా అన్నారు.  ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా అమిత్ షా  విచ్చేయగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్   తమిళ నాడు ముఖ్య మంత్రి పళనిస్వామి , అలాగే ఉప ముఖ్యమంత్రి  పన్నీర్ సెల్వం కూడా హాజరయ్యారు.   


కాగా  రజినీకాంత్ 2017 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ కూడా పెట్టాడు. అయితే  ఈ రెండు సంవత్సరాలలో రజిని క్రియాశీలక రాజకీయాల్లో అంత ఆక్టివ్ గా పాల్గొనలేదు. అయితే 2021లో తమిళనాడు లో జరుగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో 234 స్థానాలనుండి పోటీచేస్తానని రజినీ ఇటీవల వెల్లడించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక  మూడు సంవత్సరాల్లో ఎన్నికల్లో  ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పార్టీ సభ్యులు అంత  పదవులకు  రాజీనామ చేస్తారని కూడా తెలిపారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: