బీజేపీ పై హిందుత్వ పార్టీ అనే ముద్రను వేయడం కోసం మొదటిలో ప్రాంతీయ పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ చాలా కృషి చేశాయి.బీజేపీ ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంస్థ కావడం ఆ పార్టీ లోని కొందరు నేతలు హిందుత్వ సిద్ధాంతానికి అనుకూలంగా వ్యాఖ్యలు,చర్యలు చేయడంతో ఆ పార్టీ పై మతముద్ర పడింది.ఒక మత ముద్ర ఉన్న పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం సరికాదనే ఉద్దేశంతో దేశ ప్రజలు ఆ పార్టీ ఎక్కువ కాలం ప్రతిపక్షం లో కూర్చోబెట్టారు.దీనితో తమకు బీజేపీ అడ్డుకాదని భావించిన కాంగ్రెస్ తప్పుల పై తప్పులు చేస్తూ ప్రజలలో తమ పై ఉన్న నమ్మకాన్ని, విశ్వసనీయతను క్రమక్రమంగా కోల్పోయి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి చేరింది.

కాంగ్రెస్ పతనాన్ని గమనించిన బీజేపీ పార్టీ తమ సిద్ధాంతాలను మార్చుకొని కొత్త వ్యూహాలతో సరికొత్త కార్యాచరణతో మోడీ,షా ద్వాయంతో ప్రజల ముందుకి వచ్చింది.ప్రాంతీయ పార్టీలు,కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసిన చిత్తు చేసి రెండవసారి రికార్డ్ స్థాయిలో సీట్లను గెలిచి అధికారాన్ని అందుకుంది. రెండవ సారి అధికారం రాగానే తమకు తిరుగులేదని ఒంటెద్దు పోకడలకు పోకుండా దేశంలో రావణకాష్టం లా రగులుతున్న కాశ్మీర్ అంశానికి పరిష్కారం దిశగా సాహసోపేత నిర్ణయం తీసుకొని ముందుకు అడుగులు వేసింది.

ప్రస్తుతం పార్లిమెంట్ లో పాస్ అయిన జమ్ము కాశ్మీర్ విభజన బిల్లు అక్టోబర్ 31 వ తేదీ నుండి అమలుకానున్నది.దానితో అక్టోబర్ 31 వ తేదీ నుండి జమ్ము కాశ్మీర్ రెండు ముక్కలు అవ్వనున్నది.కాశ్మీర్ ను భారత్ లో చివరి వరకు కలిపేందుకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు నాడు ఈ సమస్య పరిష్కారం సాధించామని ఈ ఘనతను ఆయనకు అంకితం చేయడానికి బిజెపి ఇలాంటి నిర్ణయం తీసుకుందని బీజేపీ వారు అనుకుంటున్నారు.

బీజేపీ నాయకులకు దేశం కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే చాలా గౌరవం ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు.కాంగ్రెస్ లా తమకు నచ్చినవారిని భుజాన వేసుకుని మిగిలిన వారిని హింసించే అలవాటు తమకు లేదని బీజేపీ ఎన్నోసార్లు నిరూపించుకుంది.దానికి అనుగుణంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని భారత్ రత్నతో గౌరవించింది.బీజేపీ తమ సిద్ధాంతాలను మార్చుకొని ప్రజలలోకి వెళ్తుంది.ఇలాంటి సమయంలో తమ మొండి వైఖరిని వదలకుండా కాంగ్రెస్ రోజురోజుకు కుదించుకుపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: