రష్యా లో పుట్టిన సిద్ధాంతం విఫలమై ఆ దేశాన్ని ముక్కలు చేసింది.అలాంటి దేశం నుండి విఫల సిద్ధాంతాన్ని తీసుకొని ఇంకా దానిని అనుసరిస్తున్న వామపక్షాలు ప్రస్తుతం కాశ్మీర్ విషయం లో వ్యవహరిస్తున్న తీరు చరిత్రను వక్రీకరిస్తున్న తీరును చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.అసలు ఈ వామపక్షాలకు ఏమైంది అంటూ అటు పాత్రికేయులు ఇటు దేశ ప్రజలు చర్చలు జరుపుతున్నారు.పార్లిమెంట్ లో సీట్ లు లేక కేవలం బయట మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. తమ ఉనికిని తమ సిద్ధాంతాన్ని మర్చిపోయిన ప్రజలలోకి వెళ్ళి తిరిగి అధికారాన్ని అందుకోవాలని ఆలోచించకుండా తమను అధికారం నుండి దూరం చేశారని పగతో వారు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది కొందరు సీనియర్ విశ్లేషకులు అనుకుంటున్నారు.

భారత్ దేశ నిర్మాణంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ తో కలిసి నడిచి అధికారాన్ని పంచుకున్న వామపక్షాలు ఇప్పుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.దేశాన్ని అభివృద్ది పథంలో నడపడానికి కృషి చేసిన వామపక్షాలు మరియు కాంగ్రెస్ ఒకేసారి ఇలా ప్రజల నుండి ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవడం చాలా బాధాకరం.

కాలానుగుణంగా నాయకులతో పాటు పార్టీలు తమ సిద్ధాంతాలను తాము వ్యూహాలను మార్చుకొని ప్రజల కోసం పని చేయాలి అలా కాకుండా మొండిగా తాము నమ్మింది మాత్రమే నిజమని దానిని అందరూ నమ్మాలని కోరుకోవడం వారిని వ్యతిరేకించిన వారిని ప్రజాస్వామ్య వ్యతిరేకులని ముద్రవేయడం సరికాదు.
మైనారిటీ బుజ్జగింపు ధోరణితో దేశాన్ని నాశనం చేస్తున్న టెర్రరిస్టుల పై ఉక్కుపాదం మోపకుండా చూస్తూ ఊరుకున్న వామపక్షాలు,కాంగ్రెస్ వైఖరికి విసిగెత్తిన జనం తమ ఓటుతో మరియు సోషల్ మీడియాలో తమ మాటలతో బుద్ధి చెబుతున్నారు.ఇప్పటికైనా వామపక్షాలు కళ్ళు తెరిచి కాంగ్రెస్ తో కలిసి తాము చేసిన తప్పులను సరి చేసుకొని తమ వైఖరిని మార్చుకొని ముందుకు నడవకుంటే ప్రజలలో మరింత నవ్వులపాలవుతారు


మరింత సమాచారం తెలుసుకోండి: