ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి నాయకులూ జంప్ అవుతూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటి నుండే ప్లాన్లు వేసుకుంటున్నారు. పార్టీ అధినేతలు పార్టీలను బలపర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.                    


ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడ్డు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌ 'ఇసుక దందా చేస్తున్నారని'  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు.                    


ఈ ఆరోపణలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమపై ధ్వజమెత్తారు. దేవినేని రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 


‘ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలను నిరూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే దేవినేని రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్‌ విసిరారు.' గతంలో ఇసుక మాఫియాపైనే దేవినేని బతికారన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగడం లేదని స్పష్టం చేశారు.


ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో 90 ఆవులు చనిపోయాయని, ఆ ఘటనను కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే వెంకటకృష్ణ మండిపడ్డారు. గతంలో 28 గోవులు చనిపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని అయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గోశాల ఘటనపై విచారణ జరిపి మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: